రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Lorry And Car Accident Warangal - Sakshi

ఆత్మకూరు(పరకాల): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన దామెర మండలం ఒగ్లాపూర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం...  దుగ్గొండి మండలం లక్ష్మిపురంకు చెందిన గద్దల వినోద్‌(25), మంద శ్యామ్‌సుందర్, సింగారపు ప్రణయ్, ఆత్మకూరు మండలం పెంచికలపేటకు చెందిన డ్రైవర్‌ కలకోటి సుమన్‌(21) పెంచికలపేటలో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వరంగల్‌కు కారులో వెళ్తున్నాడు.

కారును ఒగ్లాపూర్‌లోని పవర్‌గ్రిడ్‌ సమీపంలో ఎదురుగా ములుగు వైపు వెళుతున్న లారీ ఢీకొట్టడంతో కారు డ్రైవర్‌ సుమన్, గద్దల వినోద్‌లు అక్కడికక్కడే మృతిచెందగా మంద శ్యామ్‌సుందర్‌కు తలకు గాయాలయ్యాయి.  చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్‌కు తరలించారు. అలాగే సింగారపు ప్రణయ్‌కు గాయాలు కాగా స్థానికంగా చికిత్స పొందుతున్నాడు. గద్దల వినోద్‌ స్వేరోస్‌ శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్నాడు. సుమన్, శ్యామ్‌సుందర్‌ మృతి పలువురిని కలచివేసింది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఓనర్‌ ఇంటి ముందు ఆందోళన..
పెంచికలపేటకు చెందిన కారుడ్రైవర్‌ కలకోటి సుమన్‌ మృతదేహంతో పెంచికలపేటకు చెందిన కారు యజమాని పసుల రాజేష్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రాజేష్‌ కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది. కారు యజమానిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top