పెన్షన్‌ దొంగల ముఠా అరెస్ట్‌ !

Cyberabad police Arrested The Gang Who Diverted The Pension Money - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాతబస్తీ వృద్ధుల ఆసరా పెన్షన్‌ల పథకంలో కుంభకోణానికి పాల్పడిన ముఠాలోని నలుగురిని సైబరాబాద్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ  స్కాంపై హైదరాబాద్‌ కలెక్టర్‌ మానిక్‌ రాజు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళఙతే... పాత బస్తీకి చెందిన 250మంది ఆసరా పెన్షన్‌లను ఈ ముఠా మూడు నెలల నుండి డైవర్ట్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముఠాలో కీలక పాత్రధారి, ప్రభుత్వ ఉద్యోగి అయిన ఇమ్రాన్‌ సోహెల్‌ అస్లాం సహాయంతో ఎమ్మార్వో పాస్‌వర్డ్‌తో ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కోన్నారు. కాగా 2017లో కూడా అస్లాం పెన్షన్‌ల స్కాంకు పాల్పడటంతో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top