వైరల్‌ వీడియో ఆధారంగా మహిళపై రౌడీషీట్

Chittoor Police Open Rowdy Sheet On Woman Based On Viral Video - Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ముట్టూరుకి చెందిన గీతాంజలి అనే మహిళపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్‌ చేశారు. సాదిక్‌ అనే మైనర్‌ బాలుడిని గీతాంజలి, ఆమె కొడుకు కలిసి దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా పోలీసులు గీతాంజలిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. 

అయితే సాదిక్‌ అనే మైనర్‌ బాలుడు ఓ అమ్మాయికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని, దీంతో ఆ అమ్మాయికి వరుసకు చిన్నమ్మ అయిన గీతాంజలి  సాదిక్‌పై దాడి చేసినట్టు సమాచారం. గీతాంజలితో పాటు ఆమె కుమారుడు కూడా సాదిక్‌ను చితకబాదాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో గీతాంజలిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top