పని ఇప్పిస్తానని చెప్పి బాలుడి కిడ్నాప్‌!

6 Year Old Kidnap In Renigunta Railway Station Andhra Pradesh - Sakshi

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఘటన

సాక్షి, చిత్తూరు: రేణిగుంట రైల్వేస్టేషన్‌లో గత రాత్రి కలకలం చోటుచేసుకుంది. ఆరు నెలల బాబును దుండగులు కిడ్నాప్‌ చేశారు. నాలుగు రోజుల క్రితం తాడి పత్రి నుంచి రేణిగుంటకు బాబుతో వచ్చిన స్వర్ణ లత అనే మహిళ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. తాడిపత్రికి చెందిన స్వర్ణలత భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లో ఉంటోంది. ఆమె తాగుబోతు భర్త అక్కడకు కూడా వచ్చి గలాట చెయ్యడంతో పుట్టింటి నుంచి బయటకు వచ్చింది.

ఈక్రమంలో రేణిగుంట రైల్వే స్టేషన్‌లో పనిచేసే స్వీపర్‌ ద్వారా ఆమెకు అనిత అనే మహిళ పరిచయమైంది. తాను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నానని.. స్వర్ణలతకు పని ఇప్పిస్తానని నమ్మబలికింది. దాంతో స్వర్ణలత నాలుగు రోజుల పాటు రైలల్వే స్టేషన్‌లోనే గడిపింది. ఈ నేపథ్యంలో తల్లీ బిడ్డలకు కొత్త బట్టలు కొనిస్తానని తీసుకెళ్లిన అనిత.. అక్కడ ఆమెను బురిడీ కొట్టించి బాబుతో ఉడాయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఇద్దరు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top