బకెట్లో పడి బాలుడు మృతి | 2 Year Old Boy Died After Fell In Bucket | Sakshi
Sakshi News home page

బకెట్లో పడి బాలుడు మృతి

Feb 24 2020 8:03 AM | Updated on Feb 24 2020 8:03 AM

2 Year Old Boy Died After Fell In Bucket - Sakshi

బాలుడు పడిన బకెట్‌ ఇదే.. ఆదిత్య (ఫైల్‌) 

సాక్షి, కుభీర్‌(ఆదిలాబాద్‌) : మండలంలోని సాంగ్వి గ్రామానికి చెందిన పొట్టేవార్‌ ఆదిత్య (2) ఆదివారం మధాహ్నం 3 గంటలకు రెండు రూపాయల బిల్ల కోసం బాత్‌రూంలోని బకెట్లో పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టేవార్‌ రజిత యోగేష్‌ దంపతులకు ఇద్దరు కుమారులు మధ్యాహ్నం కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగా చిన్న కుమారుడు ఆదిత్య ఆడుకుంటూ.. బాత్‌రూంలోకి వెళ్లాడు. ఆడుకుంటుండగా రెండు రూపాయల బిల్ల బకెట్లో పడింది. దానిని తీయడానికి బకెట్లోకి వంగి తీసుకునే ప్రయత్నంలో అందులో పడిపోయాడు. నీటిలో తల మునగడంతో అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన కుటుంబసభ్యులు భైంసా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. 

గ్రామంలో విషాదం..
మండలంలోని సాంగ్వి గ్రామంలో ఆదివారం రెండు రూపాయల బిల్ల కోసం బకెట్లో పడి పొట్టేవార్‌ రజిత యోగేశ్‌ దంపతుల చిన్న కుమారుడు ఆదిత్య (2)మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వందలాది మంది తరలివచ్చారు. తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement