తిరుమలలో బాలయ్య అభిమానుల అత్యుత్సాహం

balayya fans slogans in tirumala - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో సినీ నటుడు బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన బామ్మర్ది బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

 శ్రీవారి దర్శనార్థం ఆయలం వెలిపలికి వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న బాలకృష్ణను చూసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జై బాలయ్య, జై సింహా అంటూ గట్టిగా నినాదాలు చేశారు. కార్యకర్తలు గట్టిగా అరుస్తున్నా ముఖ్యమంత్రి వారించే ప్రయత్నం చేయలేదు. తిరుమల ​శ్రీవారి సన్నిధానంలో శ్రీవారిని తప్ప ఇతరుల గురించి నినాదాలు చేయరాదని టీటీడీ నిబంధనలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top