విమానంలో ఉండగా.. శాంసంగ్ ఫోన్లో మంటలు | US plane evacuated after new Samsung phone catches fire | Sakshi
Sakshi News home page

విమానంలో ఉండగా.. శాంసంగ్ ఫోన్లో మంటలు

Oct 6 2016 10:19 AM | Updated on Sep 4 2017 4:25 PM

విమానంలో ఉండగా.. శాంసంగ్ ఫోన్లో మంటలు

విమానంలో ఉండగా.. శాంసంగ్ ఫోన్లో మంటలు

అమెరికాలోని కెంటకీ రాష్ట్రం నుంచి మరికొద్ది సేపట్లో బయల్దేరాల్సిన విమానంలో శాంసంగ్ ఫోనుకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా విమానాన్ని ఖాళీ చేయించారు.

అమెరికాలోని కెంటకీ రాష్ట్రం నుంచి మరికొద్ది సేపట్లో బయల్దేరాల్సిన విమానంలో శాంసంగ్ ఫోనుకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా విమానాన్ని ఖాళీ చేయించారు. కెంటకీ నుంచి బాల్టిమోర్ వెళ్లాల్సిన విమానంలో ఉన్న ప్రయాణికుడి వద్ద ఉన్న శాంసంగ్ ఫోనులోంచి పొగలు వచ్చినట్లు ఒక కస్టమర్ తమకు ఫిర్యాదు చేశారని విమాన సిబ్బంది తెలిపారు. బ్రియాన్ గ్రీన్ అనే వ్యక్తి వద్ద ఉన్న సరికొత్త శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోనులోంచి ఈ పొగలు, మంటలు వచ్చాయని గుర్తించారు. అయితే శాంసంగ్ కంపెనీ మాత్రం..  అతడి వద్ద ఏ ఫోను ఉన్నదీ ఇంకా తమకు స్పష్టం కాలేదని తెలిపింది.

సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ అధికారులను తాము సంప్రదిస్తున్నామని, కాలిపోయిన ఫోన్ స్వాధీనం చేసుకుని, అందుకు కారణాలేంటో పరిశీలిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ అయిన శాంసంగ్.. తాము ఇప్పటికి 25 లక్షల స్మార్ట్ ఫోన్లను రీప్లేస్ చేశామని చెప్పింది. బ్యాటరీలో లోపం వల్లే ఈ ఫోనుకు మంటలు అంటుకోవడం లేదా పేలడం జరుగుతున్నట్లు తెలిసింది. తాను కూడా ఇలా ఫోన్ మార్చుకున్నానని, అయినా మార్చిన ఫోన్ కూడా మంటలు అంటుకుందని బ్రియాన్ గ్రీన్ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ మార్చి ఇచ్చిన ఫోన్లు కూడా అంతంగానే ఉన్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. కొత్త మోడల్ ఫోన్లకు అమెరికా వినియోగదారుల ఉత్పత్తుల భద్రతా కమిషన్ నుంచి అనుమతి కూడా వచ్చింది. విమానంలో ఉండగా శాంసంగ్ ఫోన్లు వాడొద్దని, వాటిని స్విచాఫ్ చేసి ఉంచాలని చాలావరకు విమానయాన సంస్థలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement