పల్సస్‌ ఎండీ శ్రీనుబాబుకు అవార్డు 

Srinubabu receives Champions of Change award - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గాను పల్సస్‌ సీఈఓ, ఎండీ డాక్టర్‌ గేదెల శ్రీనుబాబుకు చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డు దక్కింది. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడి చేతుల మీదుగా శ్రీనుబాబు ఈ అవార్డును అందుకున్నారు. పల్సస్‌ సంస్థ... ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా  హెల్త్‌ కేర్‌ రంగానికి సంబంధించి ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్స్‌ను ప్రచురిస్తోంది. విదేశాలతో పాటు హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, విశాఖపట్నం ప్రాంతాల్లో సంస్థకు కార్యాలయాలున్నాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top