రూపాయికి చమురు సెగ!

Brent crude price in international market - Sakshi

ఒకేరోజు 26పైసలు పతనం 

డాలర్‌ మారకంలో  67.13వద్ద ముగింపు

15 నెలల కనిష్ట స్థాయి  

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బేరల్‌కు 75 డాలర్లు దాటడం... డాలర్‌ ఇండెక్స్‌ పరుగు... దీనితో డాలర్‌ మరింత పెరిగిపోతుందేమోనని చమురు దిగుమతి కంపెనీల ఆందోళన... దీనితో పెద్ద ఎత్తున ఆ దేశం కరెన్సీ కొనుగోళ్లు... వెరసి డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో  ఏకంగా 26పైసలు పడిపోయింది. స్టాక్‌ మార్కెట్‌ లాభాలు కూడా రూపాయి బలాన్ని ఇవ్వలేకపోయాయి. రూపాయి విలువ  67 స్థాయిని దాటిపోయి, 67.13 వద్ద ముగిసింది.

ఇది 15 నెలల కనిష్ట స్థాయి.  క్రూడ్‌ ఆయిల్‌ పరుగు... వాణిజ్యలోటు తీవ్రత, క్యాపిటల్‌ అవుట్‌ఫ్లోస్‌ అవకాశాల వంటి సందేహాలకు దారితీస్తోందని ఇది రూపాయి పతనానికి కారణమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మార్కెట్‌ పెరిగినా, ఎఫ్‌ఐఐలు భారత ఈక్విటీల్లో నికర అమ్మకందారులుగానే కొనసాగుతుండడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్‌లో మొత్తం భారత్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.15,500 కోట్లు ఉపసంహరించుకున్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top