మార్చి 27న బ్యాంకుల సమ్మె

2 bank unions announce strike on March 27 opposing mergers  - Sakshi

చెన్నై:  బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు సంఘాలు మరోసారి  సమ్మె  చేపట్టనున్నాయి.  కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మెగా బ్యాంక్ విలీనాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ రంగంలోని రెండు ప్రధాన యూనియన్లు  (ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్,  ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్) మార్చి 27 న సమ్మెకు దిగనున్నాయి.

బ్యాడ్‌ లోన్ల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు  సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటచలం అన్నారు. చెడు రుణాల మొత్తం  రూ. 216,000 కోట్లుగా వుండటంతో,  2019 మార్చి 31 తో ముగిసిన సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ .150,000 కోట్ల స్థూల లాభాలకు పరిమితమైనాయని తెలిపారు. దీంతో రూ .66,000 కోట్ల నికర నష్టం వాటిల్లిందని విమర్శించారు. తాజా బ్యాంకుల విలీనం వల్ల భారీ  ఎత్తున పేరుకు పోయిన కార్పొరేట్  బ్యాడ్‌ లోన్లు తిరిగి వస్తాయని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు. దీనికి  ఉదాహరణగా ఎస్‌బీఐ విలీనం విలీనం తరువాత ఈ  బెడదమరింత పెరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు.  కేవలం 323 మిలియన్ల జనాభా ఉన్న అమెరికాలో బ్యాంకుల సంఖ్య భారతదేశంలోని బ్యాంకుల కంటే ఎక్కువ ఉందని, అలాంటిది 1.35 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో మరిన్ని బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల  ఏకీకరణ అవసరం లేదని వెంకటాచలం అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top