
’అనాడు ఏం మాట్లాడావు అఖిలప్రియ..?’
మూడేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందేమీలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలోనే వైఎస్ జగన్ సీఎం కావాలన్న అఖిలప్రియ ఏడాది తిరక్కుండానే మారారని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌పార్టీలో గెలిచి టీడీపీలో చేరిన అఖిలప్రియ ఏ మొహంతో ఇప్పుడు చంద్రబాబుకు మద్దతు కోరుతున్నారని ప్రశ్నించారు. 2019లో వైఎస్ జగన్ సీఎం కావాలంటే ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి గెలిపించాలని అన్నారు. అందరం సైనికుల్లా పనిచేసి శిల్పాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.