విశాఖ చేరుకున్న వైఎస్ విజయమ్మ | YS Vijayamma reaches Visakhapatnam to tour cyclone-hit areas | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న వైఎస్ విజయమ్మ

Oct 16 2013 8:43 AM | Updated on May 25 2018 9:10 PM

విశాఖ చేరుకున్న వైఎస్ విజయమ్మ - Sakshi

విశాఖ చేరుకున్న వైఎస్ విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయల్దేరారు. జిల్లాలోని ఫై-లిన్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయల్దేరారు. జిల్లాలోని   ఫై-లిన్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తారు. పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు పరామర్శించనున్నారు. కొద్దిసేపటి క్రితం విజయమ్మ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ నేతల స్వాగతం పలికారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆమె శ్రీకాకుళం చేరుకుంటారు.ఇచ్చాపురం నియోజక వర్గంలో విజయమ్మ పర్యటన కొనసాగనుంది. ఇచ్చాపురం నియోజకవర్గంలో కంచలీ,పెద్ద కొజ్జారియా, జాడుపుడి,రాజుపురం, జగతి, ఇద్దివానిపాలెం,కళింగ  పట్నం,ఇసుకపాలెం,తలతంపర,బారువులో పర్యటిస్తారు.ఫైలిన్ తుఫాన్ వల్ల నష్టపోయిన కొబ్బరి, జీడి రైతులను , మత్స్యకారులను విజయమ్మ పరామర్శిస్తారు. తర్వాత తుఫాన్ వల్ల దెబ్బతిన రహదారులను, విద్యుత్ వ్యవస్థను  స్వయంగా పరిశీలిస్తారు.సాయంత్రానికి పర్యటన పూర్తిచేసుకోని రాత్రి పలాసలో బస చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement