ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు | ys jagan mohan reddy greets muslims on occasion of ramadan festival | Sakshi
Sakshi News home page

ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

Jul 6 2016 4:37 PM | Updated on Oct 16 2018 6:01 PM

ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు - Sakshi

ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : ముస్లిం సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు శుభాకాంక్షలు చెప్పారు. రంజాన్ పర్వదినం మాత్రమే కాదని, ప్రపంచ మానవాళికి అదొక స్ఫూర్తి  అని అన్నారు.

సర్వ మానవాళి సుఖంగా ఉండాలన్న ఆర్తి ముస్లిం సోదరుల ప్రార్థనలలో కనిపిస్తుందని తెలిపారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని పేర్కొన్నారు. ప్రజలు భగవంతుని కృప వల్ల సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement