పొట్టకూటి కోసం జిల్లాలు దాటి వలస వచ్చిన కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒక యువకుడు మృతి
నాదెండ్ల (గుంటూరు) : పొట్టకూటి కోసం జిల్లాలు దాటి వలస వచ్చిన కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గా యాలైన ఘటన బుధవారం చోటు చేసుకుం ది. గుంటూరు జిల్లా గణపవరం జాతీయ రహదారిలోని స్పి న్నింగ్ మిల్లు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో తాడేపల్లిగూడెంకు చెందిన చెల్లంకి దుర్గాప్రసాద్ (21) మృతి చెందాడు.
తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన శివకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొందరు యువకులు గణపవరంలో నివాసముంటూ రోజూ స్పిన్నింగ్ మిల్లు పనులకు వెళ్తుంటా రు. ఈ క్రమంలో దుర్గాప్రసాద్, శివ బైక్‌పై వెళ్తుండగా వేగంగా వెళ్తు న్న మరో ద్విచక్ర వాహనదారుడు ఓవర్‌టేక్ చేయబోయి ఢీకొట్టారు. దీంతో దుర్గాప్రసాద్ తలకు బల మైన గాయమై అక్కడి కక్కడే మృతిచెందాడు. శివకు తీవ్ర గాయాల వడం తో చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు.