ఒక బైకు.. ఏడుగురు ప్రయాణికులు.. | six people on a bike | Sakshi
Sakshi News home page

ఒక బైకు.. ఏడుగురు ప్రయాణికులు..

Aug 1 2017 5:01 PM | Updated on Sep 17 2017 5:03 PM

ఒక బైకు.. ఏడుగురు ప్రయాణికులు..

ఒక బైకు.. ఏడుగురు ప్రయాణికులు..

కళ్ల ముందు ఎవరైనా బైక్‌పై నుంచి పడి గాయపడితే అయ్యో పాపం అని జాలి చూపుతాం.

తిరుపతి: కళ్ల ముందు ఎవరైనా బైక్‌పై నుంచి పడి గాయపడితే అయ్యో పాపం అని జాలి చూపుతాం. ఒక్కో సారి ఏం వీడికి పోయేకాలం అంత ర్యాష్‌ డ్రైవింగ్ చేస్తున్నాడు అంటూ క్లాస్‌ పీకుతుంటాము. అయితే అవేమీ మాకు సంబంధం లేదంటూ కొందరు నగర రోడ్లపై రయ్‌.. రయ్‌.. మంటూ దూసుకెళ్తున్నారు. అదికూడా బైక్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్న నిబంధనలు ఉన్నా ముగ్గురు.. నలుగురు కాదు కాదు ఏకంగా ఏడు మందికిపైగా ఎక్కించుకుని రోడ్లపై వెళ్తున్నారు.

అందులోనూ చిన్న పిల్లలు, మహిళలు ఉంటున్నారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో ఎదురుగా ఏదైనా వాహనాలు వచ్చినా, ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పెను ప్రమాదంతో భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఇలా ప్రయాణించే వారికి ట్రాఫిక్‌ నిబంధనలపై ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రమాదం జరిగినప్పుడు అయ్యో పాపం అని చేతులు దులుపుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement