శంబరకు జాతర శోభ | Shambara Polamamba Festival in Vizianagaram | Sakshi
Sakshi News home page

శంబరకు జాతర శోభ

Jan 27 2020 1:24 PM | Updated on Jan 27 2020 1:24 PM

Shambara Polamamba Festival in Vizianagaram - Sakshi

శంబర పోలమాంబ

మక్కువ: శంబర గ్రామం ఉత్సవ శోభ సంతరించుకుంది. ఏ ఇల్లు చూసినా జాతర సందడితో కళకళలాడుతోంది. పోలమాంబ అమ్మవారి ఆల య పరిసరాల్లో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఉత్సవానికి సూచికగా సోమవారం తొలేళ్ల సంబరం మొదలవుతుంది. మంగళవారం సిరిమానోత్సవం జరగనుంది. ఈ జాతరకు ఇతర జిల్లాలతోపాటు, ఒడిశా, చత్తిస్‌గఢ్‌ రాష్ట్రాలతోపాటు, జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందు కు వచ్చే అవకాశముంది. జాతరకు వచ్చే భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓఎస్‌డీ రామ్మోహన్, బొబ్బిలి ఏఎస్పీ గౌతమిశాలీ, సబ్‌కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్‌ పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లు వేగవంతంగా జరిపించారు. సోమవా రం తెల్లవారుజాము నుంచి వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులుతీరేఅవకాశమున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో బి.ఎల్‌.నగేష్‌ ఆధ్వర్యంలో జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం ఎంపీడీవో సీహెచ్‌.సూర్యనా రాయణ, తహసీల్దార్‌ డి.వీరభద్రరరావు, దేవ దాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ జె.వినోధ్‌కుమార్, పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ జా న్‌సుందరం జాతర ఏర్పాట్లు పరిశీలించారు. 

జాతరకు పటిష్ట నిఘా
జాతరను ఈ ఏడాది మూడుడ్రోన్‌ కెమెరాలను నిఘాకోసం వినియోగిస్తున్నారు. 10 స్టాట్యూ ట్‌ కెమెరాలతో ఒకే కంట్రోల్‌రూమ్‌నుంచి మానిటరింగ్‌ చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతరలో ఓఎస్‌డీ,  ఏఎస్పీతో పా టు, ఐదుగురు డీఎస్పీలు, 50మంది సీఐలు, 30మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు, హోంగార్డులు, ఏపీఎస్పీ, క్లూస్‌టీం, క్రైంపార్టీ, రోప్‌పార్టీ, సేవాదళ్‌(పోలీస్‌మిత్ర) సభ్యులు మొత్తంగా జాతరలో 850మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

25వేలు లడ్డూ ప్రసాదం తయారీ
భక్తులకు ప్రసాదాన్ని అందించేందుకు ఆలయ ఈవో బి.ఎల్‌.నగేష్‌ ఆద్వర్యంలో 25వేలు లడ్డూప్రసాదాన్ని తయారు చేశారు. భక్తులకు అవసరమైన మేరకు పులిహోర ప్రసాదాన్ని తయారుచేశారు. దేవదాయశాఖకు చెందిన 114మంది విధులు నిర్వర్తించనున్నారు. వనంగుడి, ప్రధానాలయం వద్ద రూ. 50, రూ. 10, ఉచిత దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎండ తగలకుండా క్యూలైన్లు పై పెండల్స్‌ ఏర్పాటు చేశారు. చంటిపిల్లలకు పాలు అందించేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు అవసరమైన మరుగుదొడ్లు నిర్మించారు.  

నాలుగుచోట్ల పార్కింగ్‌ స్థలాలు
గ్రామం నలువైపులా నాలుగుచోట్ల పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. మక్కువ నుంచి కవిరిపల్లి మీదుగా శంబర చేరుకునే వాహనాలను జడ్పీహెచ్‌ఎస్‌ సమీపంలో, చెముడు మీదుగా వచ్చే వాహనాలు గోముఖీబ్రిడ్జ్‌ వద్ద, మామిడిపల్లి మీదుగా వచ్చే వాహనాలు వీఆర్‌ఎస్‌ ప్రాజెక్ట్‌ వద్ద, మావుడి నుంచి ఎస్‌.పెద్దవలస మీదుగా వచ్చే వాహనాలు గ్రామం శివార్లో నిలుపుదల చేయాల్సి ఉంది.

సీసీ కెమెరాల ఏర్పాటు
జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటణలు జరగకుండా 8సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. గ్రామంలోని వనంగుడి వద్ద, చదురుగుడి క్యూలైన్లు, అంగన్వాడీ కార్యాలయం, పీహెచ్‌సీ వద్ద నాలుగు వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలోని 124మంది పారిశుద్ధ్య కార్మికులతో పనులు జరిపిస్తున్నారు. చదురుగుడి వద్ద అయిదు కంట్రోల్‌రూమ్‌లు, రామమందిరం వద్ద ఒక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. చదురుగుడి క్యూలైన్‌వద్ద పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్‌కో, మెడికల్, దేవదాయశాఖ అధికారులు ఉండగా, రామమందిరం వద్ద పంచాయతీ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.

జాతరకు 230 బస్సులు
శంబర జాతర సందర్భంగా ఆదివారం నుంచి బుధవారం వరకు సుమారు 230 బస్సులు నడపనున్నట్లు  పార్వతీపురం డిపో మేనేజర్‌ జాన్‌సుందరం తెలిపారు. ఆదివారం ఆయన ఆర్టీసీబస్సులు నిలుపదల చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. పార్వతీపురం డిపోనుంచి 60బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు.

గ్రామానికి చేరుకున్న సిరిమాను కర్ర
మండలంలోని నండబొడ్డవలస గ్రామానికి చెందిన రైతు అప్పారావు పొలంలో సేకరించిన సిరిమాను కర్ర, గుజ్జుమాను కర్రను గ్రామానికి చెందిన రైతులు ఆదివారం పశువులేర్లతో తీసుకువచ్చారు. సుమారు 40అడుగుల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement