breaking news
polamamba temple trust chairman
-
శంబరకు జాతర శోభ
మక్కువ: శంబర గ్రామం ఉత్సవ శోభ సంతరించుకుంది. ఏ ఇల్లు చూసినా జాతర సందడితో కళకళలాడుతోంది. పోలమాంబ అమ్మవారి ఆల య పరిసరాల్లో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఉత్సవానికి సూచికగా సోమవారం తొలేళ్ల సంబరం మొదలవుతుంది. మంగళవారం సిరిమానోత్సవం జరగనుంది. ఈ జాతరకు ఇతర జిల్లాలతోపాటు, ఒడిశా, చత్తిస్గఢ్ రాష్ట్రాలతోపాటు, జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందు కు వచ్చే అవకాశముంది. జాతరకు వచ్చే భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓఎస్డీ రామ్మోహన్, బొబ్బిలి ఏఎస్పీ గౌతమిశాలీ, సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్ పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లు వేగవంతంగా జరిపించారు. సోమవా రం తెల్లవారుజాము నుంచి వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులుతీరేఅవకాశమున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో బి.ఎల్.నగేష్ ఆధ్వర్యంలో జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం ఎంపీడీవో సీహెచ్.సూర్యనా రాయణ, తహసీల్దార్ డి.వీరభద్రరరావు, దేవ దాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ జె.వినోధ్‌కుమార్, పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్ జా న్సుందరం జాతర ఏర్పాట్లు పరిశీలించారు. జాతరకు పటిష్ట నిఘా జాతరను ఈ ఏడాది మూడుడ్రోన్ కెమెరాలను నిఘాకోసం వినియోగిస్తున్నారు. 10 స్టాట్యూ ట్ కెమెరాలతో ఒకే కంట్రోల్‌రూమ్‌నుంచి మానిటరింగ్ చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతరలో ఓఎస్డీ, ఏఎస్పీతో పా టు, ఐదుగురు డీఎస్పీలు, 50మంది సీఐలు, 30మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు, హోంగార్డులు, ఏపీఎస్పీ, క్లూస్‌టీం, క్రైంపార్టీ, రోప్‌పార్టీ, సేవాదళ్(పోలీస్‌మిత్ర) సభ్యులు మొత్తంగా జాతరలో 850మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 25వేలు లడ్డూ ప్రసాదం తయారీ భక్తులకు ప్రసాదాన్ని అందించేందుకు ఆలయ ఈవో బి.ఎల్.నగేష్ ఆద్వర్యంలో 25వేలు లడ్డూప్రసాదాన్ని తయారు చేశారు. భక్తులకు అవసరమైన మేరకు పులిహోర ప్రసాదాన్ని తయారుచేశారు. దేవదాయశాఖకు చెందిన 114మంది విధులు నిర్వర్తించనున్నారు. వనంగుడి, ప్రధానాలయం వద్ద రూ. 50, రూ. 10, ఉచిత దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎండ తగలకుండా క్యూలైన్లు పై పెండల్స్ ఏర్పాటు చేశారు. చంటిపిల్లలకు పాలు అందించేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు అవసరమైన మరుగుదొడ్లు నిర్మించారు. నాలుగుచోట్ల పార్కింగ్ స్థలాలు గ్రామం నలువైపులా నాలుగుచోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మక్కువ నుంచి కవిరిపల్లి మీదుగా శంబర చేరుకునే వాహనాలను జడ్పీహెచ్ఎస్ సమీపంలో, చెముడు మీదుగా వచ్చే వాహనాలు గోముఖీబ్రిడ్జ్ వద్ద, మామిడిపల్లి మీదుగా వచ్చే వాహనాలు వీఆర్ఎస్ ప్రాజెక్ట్ వద్ద, మావుడి నుంచి ఎస్.పెద్దవలస మీదుగా వచ్చే వాహనాలు గ్రామం శివార్లో నిలుపుదల చేయాల్సి ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటు జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటణలు జరగకుండా 8సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. గ్రామంలోని వనంగుడి వద్ద, చదురుగుడి క్యూలైన్లు, అంగన్వాడీ కార్యాలయం, పీహెచ్సీ వద్ద నాలుగు వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలోని 124మంది పారిశుద్ధ్య కార్మికులతో పనులు జరిపిస్తున్నారు. చదురుగుడి వద్ద అయిదు కంట్రోల్‌రూమ్‌లు, రామమందిరం వద్ద ఒక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. చదురుగుడి క్యూలైన్‌వద్ద పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్‌కో, మెడికల్, దేవదాయశాఖ అధికారులు ఉండగా, రామమందిరం వద్ద పంచాయతీ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. జాతరకు 230 బస్సులు శంబర జాతర సందర్భంగా ఆదివారం నుంచి బుధవారం వరకు సుమారు 230 బస్సులు నడపనున్నట్లు పార్వతీపురం డిపో మేనేజర్ జాన్‌సుందరం తెలిపారు. ఆదివారం ఆయన ఆర్టీసీబస్సులు నిలుపదల చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. పార్వతీపురం డిపోనుంచి 60బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. గ్రామానికి చేరుకున్న సిరిమాను కర్ర మండలంలోని నండబొడ్డవలస గ్రామానికి చెందిన రైతు అప్పారావు పొలంలో సేకరించిన సిరిమాను కర్ర, గుజ్జుమాను కర్రను గ్రామానికి చెందిన రైతులు ఆదివారం పశువులేర్లతో తీసుకువచ్చారు. సుమారు 40అడుగుల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. -
దేశం నేతలకు 'వెలగ'పోటు..!
తమవారిని కాదని బీజేపీ నేతకు పదవి కార్పొరేటర్ సీటు కోసం చైర్మన్ పదవి ఎర తన స్వార్థం కోసం ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత వ్యూహం పోలమాంబ ఆలయ ట్రస్ట్ బోర్డు సాక్షిగా బయటపడ్డ విభేదాలు విశాఖపట్నం : పదవి కోసం పచ్చ పార్టీ నేతలు ఎంతటి కుతంత్రాలకైనా ఒడిగడతారు... ఎలాంటి మోసాలకైనా సిద్ధపడతారు అనడానికి తాజా ఉదంతమే ఓ ఉదాహరణ. సొంత పార్టీలో ఎంతో కాలంగా ఆశలు పెంచుకున్న వారిని కాదని... స్వప్రయోజనాల కోసం బీజేపీ నేతకు పదవి కట్టబెట్టడం ఇప్పుడు టీడీపీలో చిచ్చురేపేతోంది. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ సీటుకు తనకెవరూ పోటీ ఉండకూడదనే స్వార్థంతో టీడీపీ 17వ వార్డు నేత బైరెడ్డి పోతన్నరెడ్డి స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ప్రసన్నం చేసుకుని పోలమాంబ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని అదే వార్డుకు చెందిన బీజేపీ నేత మరడ వెంకటరెడ్డికి కట్టబెట్టారు. ఎంతో కాలంగా ఆ పదవి కోసం ఆశలు పెంచుకున్న టీడీపీ మహిళా నేత వాకా సత్యవతికి వెన్నుపోటు పొడిచారు. కార్పొరేటర్ సీటు కోసం స్కెచ్ పద్నాలుగు గ్రామాల కల్పవల్లిగా భాసిల్లుతున్న పెదవాల్తేరు పోలమాంబ అమ్మవారి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో 14 గ్రామాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. అంటే ఎవరు చైర్మన్‌గా ఉంటే వారికి పద్నాలుగు గ్రామాలపై పట్టు ఉంటుంది. కనీసం ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా తన స్వార్థం కోసం పోతన్న రెడ్డి వ్యూహం రచించారు. దానికి ఎమ్మెల్యే వెలగపూడి కూడా మద్దతు పలకడంతో సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. జీవీఎంసీ ఎన్నికలలో టీడీపీ, బీజేపీలు పొత్తుపెట్టుకుని బరిలో దిగే అవకాశం ఉందనే వార్తలు రావడంతో బీజేపీ 17వ వార్డు అధ్యక్షుడు వెంకటరెడ్డి కార్పొరేటర్ సీటు కోసం భారీ ఆశలే పెట్టుకున్నారు. దీంతో అధికార పార్టీలో సీనియర్ నేతగా చలామణి అవుతున్న బైరెడ్డి పోతన్నరెడ్డి తన వార్డులో బీజేపీ పోటీలో లేకుండా చేయాలని భావించారు. అనుకున్నదే తడువుగా ఎమ్మెల్యే అండతో వ్యూహం రచించి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని వెంకటరెడ్డికి ఎరగా వేశారు. వార్డులో మిత్రపక్షం నుంచి తనకు పోటీ లేకుండా చేసుకున్నారు. భగ్గుమంటున్న టీడీపీ వర్గీయులు ఎన్నాళ్లుగానో పోలమాంబ అమ్మవారి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా నియమాకం కావాలని ఆశించిన వాకా సత్యవతి సొంత పార్టీ నేత చేసిన కుట్రను, అందుకు ఎమ్మెల్యే వెగలపూడి మద్దతు తెలపడాన్ని భరించలేకపోతున్నారు. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా బీజేపీకి చెర్మైన్ పదవిని ఇచ్చేశారంటూ టీడీపీ వర్గీయులే దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక్క నేత లబ్ధి కోసం ఏకంగా 14గ్రామాలతో ముడిపడి ఉన్న పోలమాంబ అమ్మవారి ట్రస్టీ చైర్మన్ కట్టబెట్టడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో ఈ వార్డులో టీడీపీ రెండుగా చీలిపోయింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేయకూడదని, పెద్దల వద్దే తాడోపేడో తేల్చుకోవాలని మహిళా నేత భావిస్తున్నట్లు సమాచారం. జీవీఎంసీ ఎన్నికల ప్రకటన వెలువడక ముందే టీడీపీలో విభేదాలు ఈ స్థాయిలో ఉంటే భవిష్యత్‌లో ఇంకెన్ని పంచాయతీలు తెరపైకి వస్తాయోనని ఆ పార్టీ వారే కలవరపడుతున్నారు.