కుకింగ్‌ చార్జీల్లో కోత! | Mid Day Meal Scheme Government Cut Cooking Charges | Sakshi
Sakshi News home page

కుకింగ్‌ చార్జీల్లో కోత!

Oct 21 2018 11:28 AM | Updated on Oct 21 2018 11:28 AM

Mid Day Meal Scheme Government Cut Cooking Charges - Sakshi

మండుటెండలో ఆరుబయట వంటలు చేస్తున్న మహిళలు

వీరఘట్టం : పిల్లలందరినీ సర్కార్‌ బడిబాట పట్టించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం రోజురోజుకూ నీరుగారుతోంది. పాలకుల నిర్ణయాలు.. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో ఈ పథకం గతి తప్పుతోంది. తాజాగా వంట ఏజెన్సీలకు ఇస్తున్న కుకింగ్‌ చార్జీల్లో కూడా కోత వేయాలని సర్కార్‌ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే తాము వంటలు చేయలేమని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదీ పరిస్థితి...
జిల్లాలో 3,155 సర్కారు విద్యా సంస్థలు ఉండగా వీటిలో 3,154 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలౌతోంది. ఈ ఏడాది 2,38,616 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఒకటి  నుంచి 5వ తరగతి విద్యార్థులు 1,58,096 మంది, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వారికి మంగళం పలికేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ బాధ్యతను అన్న క్యాంటీన్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా  కందిపప్పు, వంటనూనె తదితర ముడిసరుకులు సరఫరా చేస్తూ ఆ మేరకు వీరికి ప్రతీ నెలా ఇచ్చే కుక్కింగ్‌ చార్జీల్లో కోత కోయనుంది. ఇప్పటికే అరకొరగా వస్తున్న కుకింగ్‌ చార్జీలు సగానికి తగ్గనుండటంతో వంట ఏజెన్సీ మహిళలు లబోదిబోమంటున్నారు.

చార్జీల్లో కోత విధిస్తే ఇక మీదట బడుల్లో వంటలు చేయలేమని  వాపోతున్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల జిల్లాలో 6,158 మంది  మహిళలు తీవ్రంగా నష్టపోనున్నారు. 1,80,520 మంది ఉన్నారు. వీరిలో 95 శాతం మంది మధ్యాహ్న భోజనాన్ని  చేస్తునట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరికి షిఫ్ట్‌ పద్ధతిలో ప్రతీ నెల 6,158 మంది మహిళలు మధ్యాహ్న భోజనాన్ని వండిపెడుతున్నారు. వీరు  తమ సొంత డబ్బులతో వంటలు చేస్తూ నెల పూర్తయిన తర్వాత  ప్రభుత్వం ఇచ్చే కుకింగ్‌ చార్జీలతో నెట్టుకొస్తున్నారు. 

చార్జీల్లో కోతకు కుట్ర
 ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికీ 100 గ్రాముల బియ్యం, మసాలా దినుసులకు రూ.4.13 పైసలు చొప్పున అలాగే 6–10 వతరగతి విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం, మసాలా ఖర్చులకు రూ.6.18 పైసలు చొప్పున ఈ మహిళలకు విద్యాశాఖ చెల్లిస్తోంది. తాజాగా ప్రభుత్వం  1–5వ తరగతి వారికి 20 గ్రాముల కందిప్పు, 5 గ్రాముల నూనె, అలాగే 6–10వ తరగతి విద్యార్థులకు 30 గ్రాముల కందిపప్పు, 7.25 గ్రాముల నూనె చొప్పున సరఫరా చేస్తోంది. ఈ సరుకులకు గాను  కుకింగ్‌ చార్జీల్లో 1–5వ తరగతి విద్యార్థులకు రూ.2లు, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.3లు కట్‌ చేయనుంది. ఈ లెక్కన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.2.18 పైసలు, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.3.18 పైసలు మాత్రమే ఇక మీదట కుకింగ్‌ చార్జీలుగా చెల్లిస్తుంది.

చాలీ చాలని చార్జీలు.. 
కందిపప్పు, నూనె ప్రభుత్వం ఇచ్చినా చింతపండు, ఉల్లి, తెల్లఉల్లి, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర, ఇతర మసాలా దినుసులు, వంట చేసేందుకు గ్యాస్‌ లేదా కట్టెలు మొదలైనవి మహిళలే సమకూర్చుకోవాలి. ప్రస్తుతం ఇస్తున్న చార్జీలే అరకొరగా ఉంటే ముందుముందు వీటిని కూడా తగ్గించడంవల్ల వంట సాధ్యం కాదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో రకంగా తాము మానేస్తే అన్న క్యాంటీన్‌ కాంట్రాక్టర్లకు ఈ పని అప్పచెప్పాలని ప్రభుత్వం యోచిస్తోందని మహిళలు మండిపడుతున్నారు. 

కూలీ కూడా గిట్టడం లేదు
సాధారణంగా 100 మంది హైస్కూలు విద్యార్థులకు వంట చేయాలంటే ప్రభుత్వం ఇచ్చే బియ్యం, కందిపప్పు, నూనె కాకుండా ఇతర  సరుకులకు  ప్రస్తుత ధరల ప్రకారం రోజుకు రూ.300 ఖర్చు అవుతుంది. వంద మందికి ప్రభుత్వం ఇచ్చే కుక్కింగ్‌ చార్జీలు రూ.318లు అంటే ఖర్చులు పోను వీరికి మిగిలేది రోజుకు  18 రూపాయలు. వంద మందికి ముగ్గురు మహిళలు వంట చేస్తున్నారు. ఈ ముగ్గురికీ ఒక్కొక్కరికీ రూ.6 గిట్టుబాటు అవుతుంది. వ్యవసాయ పనికి వెళితే ఒక్కో మహిళకు రోజుకు రూ.180 ఇస్తున్నారు. అంటే కనీసం శ్రమకు తగ్గ ఫలితం కూడా రావడం లేదన్న మాట.

మా కష్టానికి తగ్గ డబ్బులు రావడం లేదు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజ న వంటలు చేస్తున్న మాకు కష్టానికి తగ్గ డబ్బులు రావ డం లేదు. దీనికి తోడు కంది పప్పు, వంటనూనెల సరఫరా పేరుతో కుకింగ్‌ చార్జీలను తగ్గిస్తే మాకు నష్టం తప్ప లాభం ఉండదు. ఎన్నో కష్టాలు పడి వంటలు చేస్తున్న మా పనిని ప్రభుత్వం గుర్తించడం లేదు. 
దూడి పార్వతి, మధ్యాహ్నభోజనం నిర్వాహకురాలు, వీరఘట్టం

మా చేతి డబ్బులు పెట్టుకుంటున్నాం
రోజూ వంట చేయడానికి మా చేతి నుంచి డబ్బులు పెట్టుకుంటున్నాం. డ్వాక్రా గ్రూపులో ఉండడంతో తప్పని సరిగా వంటలు చేస్తున్నాం. లేదంటే ఈ వంటలు మేము చేయలేం. వరిచేనులో కలుపు తీస్తే రోజుకు రూ.150 ఇస్తున్నారు. వంట చేయడం వల్ల కనీసం రోజుకు రూ.20లు కూడా రావడం లేదు.
– ఎండు దుర్గమ్మ,మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు, వీరఘట్టం

ఇది ప్రభుత్వ నిర్ణయం
మధఆ్యహ్నం భోజనానికి కావాల్సిన ముడిసరుకులు సరఫరా చేసి వంట ఏజెన్సీలకు ఇచ్చే కుకింగ్‌ కాస్ట్‌లో వీటిని మినహాయించి మిగిలిన మొత్తాన్ని వారికి అందజేస్తాం. ప్రస్తుతం అక్టోబర్‌ నెల కందిపప్పు మాత్రం ఇచ్చాం. నవంబర్‌ నుంచి వంటనూనె, పప్పు సరఫరా చేస్తాం. వీటికి కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కుకింగ్‌ చార్జీల్లో మినిహాయిస్తాం. 
– ఎం.సాయిరాం, జిల్లా విద్యాశాధికారి, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement