ప్రశ్నాపత్రాల కొరతతో ఐటీఐ పరీక్షల్లో ఆలస్యం | ITI exams started lately due to lack of question papers | Sakshi
Sakshi News home page

ప్రశ్నాపత్రాల కొరతతో ఐటీఐ పరీక్షల్లో ఆలస్యం

Feb 20 2015 2:14 PM | Updated on Sep 2 2017 9:38 PM

ప్రశ్నాపత్రాల కొరతతో ఐటీఐ పరీక్షల్లో ఆలస్యం

ప్రశ్నాపత్రాల కొరతతో ఐటీఐ పరీక్షల్లో ఆలస్యం

ప్రశ్నాపత్రాల కొరత కారణంగా విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఐటీఐ సెమిస్టర్ పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.

బొబ్బిలి : ప్రశ్నాపత్రాల కొరత కారణంగా విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఐటీఐ సెమిస్టర్ పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 830 మంది విద్యారులు బొబ్బిలిలోని ప్రభుత్వ ఐటీఐలో పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే, 200 ప్రశ్నాపత్రాలు కొరత ఉండడంతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మొదలు కాలేదు.

జిరాక్స్ తీసి పరీక్ష నిర్వహిద్దామన్నా, విద్యుత్ లేకపోవడంతో ఆలస్యం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 1.30 గంటల తర్వాత కరెంట్ రావడంతో ప్రశ్నాపత్రాలను జిరాక్స్ తీసి పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ప్రశ్నాపత్రాల కొరత నెలకొన్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement