‘రాష్ట్ర విభజన’ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు | High court will judgement for state bifurcation petition today | Sakshi
Sakshi News home page

‘రాష్ట్ర విభజన’ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

Oct 8 2013 2:35 AM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు తన తీర్పును మంగళవారం వెలువరించనున్నది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు తన తీర్పును మంగళవారం వెలువరించనున్నది. రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 3వ అధికరణ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రవేశికకు విరుద్ధంగా ఉందని, ఈ దృష్ట్యా దాన్ని కొట్టివేయాలని, అలాగే రాష్ట్రంలో 371(డి) అధికరణ అమల్లో ఉండగా 3వ అధికరణకు అనుగుణంగా రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని, ఆమేరకు తగిన ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ న్యాయవాది పీవీ కృష్ణయ్య పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ పిటిషన్‌పై ఏ నిర్ణయమనేదీ మంగళవారం చెబుతామని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement