మూడు నెలలు బెయిల్ ఇవ్వండి: మోపిదేవి వెంకటరమణ | give bail for three months: Mopidevi venkataramana | Sakshi
Sakshi News home page

మూడు నెలలు బెయిల్ ఇవ్వండి: మోపిదేవి వెంకటరమణ

Sep 6 2013 5:01 AM | Updated on Jul 6 2019 12:52 PM

తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, వైద్యచికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.

ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మోపిదేవి
 సీబీఐకి  నోటీసులు... విచారణ నేటికి వాయిదా


 సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, వైద్యచికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మోపిదేవి తరఫున ఆయన న్యాయవాది సురేందర్‌రావు గురువారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా తాను తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తాను ఇటీవల కేర్ ఆసుపత్రి వైద్యులతో పరీక్షలు చేయించుకున్నానని  మోపిదేవి తెలిపారు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఈ మేరకు కేర్ వైద్యుల అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించారు. చికిత్సలో భాగంగా డాక్టర్ల పర్యవేక్షణలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇంజెక్షన్లకు తగ్గకపోతే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో తనకు మూడు నెలల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు... సీబీఐకి నోటీసులు జారీచేస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement