విశాఖ ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీకవ్వడంతో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
గాజువాక (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీకవ్వడంతో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్(స్టీల్ మెల్ట్ షాప్)-1లో జరిగింది. ఎస్‌ఎమ్‌ఎస్-1లోని ఎల్‌బీ-పేలోకి కోకో వెన్ ద్వారా గ్యాస్ సరఫరా కావడంతో ఫైర్ అవుతుంది. అయితే ప్రమాదవశాత్తు ఆ గ్యాస్ లీకైంది.
అది విష వాయువు కావడంతో అక్కడే విధుల్లో ఉన్న భాస్కర్‌రావు, రామారావు, శ్రీనివాసరావు అనే ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని వెంటనే స్టీల్‌ప్లాంట్‌లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిలో శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వైజాగ్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.