పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ప్రతి పోలీసు స్టేషన్‌లో రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు
అమలాపురం టౌన్ : పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ప్రతి పోలీసు స్టేషన్‌లో రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ రాముడు తెలిపారు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో రూ.22 లక్షలతో నూతనంగా నిర్మించిన పోలీసు రిసెప్షన్ కౌంటర్ భవనాన్ని హోం మంత్రి చినరాజప్పతో కలిసి డీజీపీ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు.
సభకు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షత వహించారు. డీజీపీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుడు పోలీసు స్టేషన్‌కు వస్తే.. రిసెప్షన్ కౌంటర్ భవనంలో ప్రశాంతంగా ఫిర్యాదు చేసుకునేలా పోలీసు సిబ్బంది సేవలందిస్తారని వివరించారు. ఇప్పుడు పెద్ద పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ కౌంటర్లను అన్ని పోలీసు స్టేషన్లకూ విస్తరిస్తామని తెలిపారు. హోంమంత్రి, డీజీపీకి అమలాపురం డీఎస్పీ లంకా అంకయ్య, పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు.
ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, డీఐజీ హరికుమార్, విశాఖపట్నం ఎస్‌ఈజెడ్ డీఐజీ కుమార విశ్వజిత్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎస్పీలు రవిప్రకాష్, ఓఎస్‌డీ శరత్‌భూషణ్, రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణ, ఏఎస్పీ దామోదర్, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, పులపర్తి నారాయణమూర్తి, అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలని కోరుతూ డీజీపీకి ఎలక్ట్రానిక్ మీడియా వినతి