రెడ్‌జోన్‌ ఏరియాలో ‘చెట్టినాడ్‌’ కార్యకలాపాలు!

Chettinad Cement Company Violates Lockdown At Renigunta - Sakshi

సాక్షి, తిరుపతి: తమిళనాడుకు చెట్టినాడ్‌ సిమెంట్‌ సంస్థ లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కింది. కరోనా రెడ్‌జోన్‌గా ఉన్న రేణిగుంటలో ఆంక్షల్ని పట్టించుకోకుండా గూడ్స్ రైళ్ల ద్వారా భారీగా సిమెంట్ దిగుమతి చేసుకుంది. దాంతోపాటు భౌతికదూరం పాటించకుండానే హమాలీలతో  యాజమాన్యం సిమెంట్ అన్‌లోడ్ చేయిస్తోంది. దాదాపు 20 వేల టన్నుల సిమెంట్‌ తమిళనాడు నుంచి రేణిగుంటకు వచ్చినట్టు తెలుస్తోంది. చెట్టినాడ్‌ సిమెంట్‌ సంస్థ నిర్వాకంపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.
(చదవండి: ఏపీలో కొత్తగా 75 పాజిటివ్‌ కేసులు)
 

ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 722కు చేరింది. వారిలో 92 మంది కోలుకున్నారు. 20 మంది మృతి చెందారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 610గా ఉంది. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 53కు చేరగా.. వారిలో నలుగురు కోలుకున్నారు. ఏపీ వ్యాప్తంగా తాజాగా నమోదైన 75 కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 25 కేసులు నమోదవడం గమనార్హం.
(చదవండి: ఏపీ ప్రభుత్వ బాటలో కేంద్ర ప్రభుత్వం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top