ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలో శనివారం ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.
పెద్దదోర్నాల: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలో శనివారం ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. మండలం పరిధిలో శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సు, ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొనగా పది మందికి గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీశైలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.