కేంద్ర మంత్రి దృష్టికి బీఎస్‌ఎన్‌ఎల్‌ సమస్యలు

BSNL issues to the Union Minister's attention - Sakshi

శ్రీకాకుళం: శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మంగళవారం దేశ రాజధానిలో కేంద్ర ప్రచారశాఖ సహాయ మంత్రి మనోజ్‌సిన్హాను కలుసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ వీక్‌గా ఉందని, దాన్ని మెరుగుపరచేందుకు పరిచేందుకు చర్య తీసుకోవాలని కోరారు. జిల్లాలో సుమారు 24 ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ టవర్లు అవసరం ఉందని వివరించారు. వాటిని కచ్చితంగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ శాఖా పరమైన నిర్ణయాలతో శ్రీకాకుళం జిల్లాలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ను విజయనగరం జిల్లాలోని  కార్యాలయంలో విలీనం చేసేందుకు నిర్ణయించినట్టు తెలియవచ్చిందని, ఇలా జరిగితే శ్రీకాకుళం జిల్లాపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిని విరమించుకోవాలని విన్నవించారు. ప్రస్తుతం జిల్లా వాణిజ్యపరంగా చాలా వేగంగా విస్తరిస్తుందని, కావున జిల్లా అభివృద్ధికి 4జీ నెట్‌వర్క్‌ చాలా అవసరమని, సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని, సిబ్బంది కొరతను పరిష్కరించాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top