'భాస్కర నాయుడును తప్పించే యత్నం' | AP govt target YSRCP Leaders, says kakani govardhan reddy | Sakshi
Sakshi News home page

'భాస్కర నాయుడును తప్పించే యత్నం'

Oct 23 2016 1:07 PM | Updated on May 29 2018 4:26 PM

'భాస్కర నాయుడును తప్పించే యత్నం' - Sakshi

'భాస్కర నాయుడును తప్పించే యత్నం'

వైఎస్సార్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాకాని గోవర్ధన్ఆరోపించారు.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు... వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. ముత్తునూరు జెడ్పీటీసీ శివప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు.

ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వెంకటాచలం మండలం అక్రమ గ్రానైట్ తవ్వకాల వ్యవహారంలో కీలక సూత్రధారి భాస్కర నాయుడును తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బావమరిది అయిన భాస్కర నాయుడు అధికార పార్టీ అండదండలతో ఈ కేసు నుంచి బయట పడాలని చూస్తున్నారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement