వ్యవసాయకూలీలు, సన్నకారు రైతులకు గ్రామాలలో పనులు కరువయ్యూరుు. మూడు పూటలా కడుపు నిండడం కష్టమైంది.
వ్యవసాయకూలీలు, సన్నకారు రైతులకు గ్రామాలలో పనులు కరువయ్యూరుు. మూడు పూటలా కడుపు నిండడం కష్టమైంది. కుటుంబపోషణ భారమైంది. పస్తులతో పల్లెలు కన్నీరు పెడుతున్నారుు. అందుకే పల్లె జనం కూలి కోసం వలసబాట పట్టారు.
- ఆలూరు
ఒక ఆలూరు నియోజకవర్గంలో సుమారు 40 గ్రామాల ప్రజలు వలసవెళ్లిపోయూరు. ఇళ్ల వద్ద పిల్లలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. పల్లెలు కళ కోల్పోరుు నిర్మానుష్యంగా మారారుు. ఆలూరు మండలం అరికెర గ్రామంలో సుమారు 35 కుటుంబాల సన్న కారు రైతులు, వ్యవసాయకూలీలు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, రాయచూరు, సింధనూరు, మొకా, బెంగళూరు,హైదారాబాద్, గుంటూరు తదితర పట్టణాలకు వలస వెళ్లారు.
మరి కొందరు రైతులు తమ ఎడ్లకు పశుగ్రాసం కొరత కారణంగా శిరుగుప్ప పట్టణ కేంద్రంలోరని షుగర్ ఫ్యాక్టరీలో పనికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అరికెల గ్రామంలో వీధులన్నీ బోసిపోయూరుు. కేవలం వృద్ధులు, బడికి వెళ్లే పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇక దేవనకొండ మండలంలోని తెర్నెకల్లు, దేవనకొండ, కప్పట్రాళ్ల, పీ,కోటకొండ, హొళగుంద మండలంలోని నెరణికి తాండ, ఎల్లార్తి,సులువాయి, విరుపాపురం, హాలహర్వి మండలంలోని చింతకుంట, అర్ధగేరి, ఆస్పరి మండలంలోని కారుమంచి, కైరుప్పల, యాటకల్లు, తురవగల్లు, ఐనకల్లు, ములుగుందం, చిప్పగిరి మండలంలోని నంచర్ల, దౌల్లాపురం, నేమకల్లు, సంగాల తదితర గ్రామాల నుంచి అధికంగా వ్యవసాయకూలీలు వలస వెళ్లారు.