తీరనున్న ఇబ్బందులు

E-Birth Certificate Apply To Online - Sakshi

పీహెచ్‌సీలలోనే ఈ–బర్త్‌ జారీ

ప్రసవ వివరాలన్నీ ఇక ఆన్‌లైన్‌లో నమోదు

తక్షణమే కేసీఆర్‌ కిట్, బర్త్‌ ధ్రువీకరణ పత్రం

సాక్షి, నార్నూర్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవానంతరం పుట్టిన శిశువు పేరుతో తక్షణమే ఈ–బర్త్‌ పేరిట జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ మన్ననలు పొందే విధంగా చర్యలు చేపడుతోంది.

అదే విధంగా పీహెచ్‌సీలలో సుఖ ప్రసవాలు జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని రకాల పరీక్షలు (రక్త, మూత్ర, షుగర్, బీపీ) చేయించుకునేందుకు హెమోటాలజీ ఎనలైజర్‌ మిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఇప్పటివరకు పీహెచ్‌సీలలో జరిగే ప్రసవ అనంతరం తక్షణమే కేసీఆర్‌ కిట్టు అందజేస్తున్నారు.

దీంతో పాటు మరింత పారదర్శకంగా ఉండేందు కు 2019 జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం జరిగే శిశువుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి అప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా ఈ–బర్త్‌ పేరిట జనన ధ్రువీకరణపత్రం జారీ చేస్తున్నారు.

పీహెచ్‌సీ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణపత్రం ఆధారంగా సబంధి త మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో ఒరి జినల్‌ ధ్రువీకరణ పత్రం క్షణాల్లో పొందే అవకాశం కల్పించారు. దీంతో నిరక్షరాస్యులు భవి ష్యత్‌ అవసరాల నిమిత్తం అధికారుల చుట్టూ జన న ధ్రువీకరణ పత్రం పొందేందుకు కార్యాలయా ల చుట్టూ తిరిగే పరిస్థితికి చెక్‌ పెట్టారు. 

ఈ–బర్త్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నాం

జనవరి ఒకటి నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీహెచ్‌సీలో కాన్పు అయిన వారికి వెంటనే ఈ–బర్త్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నాం. ఆన్‌లైన్‌ ద్వారా ఈ ప్రక్రియను చేపడుతున్నాం. దీంతో బాధితులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సర్టిఫికెట్‌ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలో చూపిస్తే వెంటనే సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.
–శ్రీకాంత్, పీహెచ్‌సీ వైద్యాధికారి, నార్నూర్‌

డాక్టర్లు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం 

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top