కడప వైఎస్సార్ సర్కిల్ : ఈ నెల 18వ తేదీన జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీఈవో సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. ప్రాధాన్యత కలిగిన సమావేశానికి ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీలు), అలాగే వైఎస్సార్ కడప మరియు అన్నమయ్య జిల్లాల అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
నేడు ’డయల్ యువర్
ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’
కడప కార్పొరేషన్ : వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 15వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ’డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు.
సర్కిల్ స్థాయిలోనూ
డయల్ యువర్ ఎస్‌ఈ
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలోనూ ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీ ర్ దష్టికి తీసుకువచ్చేందుకు వినియోగదారులు 08562242457 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
సౌత్ జోన్ అండర్–16
క్రికెట్ పోటీలకు ఎంపిక
మదనపల్లె సిటీ : సౌత్ జోన్ అండర్–16 బాలుర అంతర్ జిల్లా మల్టీ డే క్రికెట్ పోటీలకు మదనపల్లెకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికై నట్లు మదనపల్లె క్రికెట్ అకాడమీ ప్రధాన కోచ్ జనార్థన్ తెలిపారు. షారిక్ అక్తర్ , తేజేష్ , ఎస్‌ఎండి మౌలా , వి.జె.నోయల్ ఎంపికై నట్లు తెలిపారు. జులై 2 వరకు వాల్మీకిపురంలోని జీవీఎస్‌సీఎస్ క్రికెట్‌మైదానంలో పోటీలు జరుగుతాయన్నారు.
‘మిట్స్’కు 4ఏ రేటింగ్
కురబలకోట : కేరీర్స్ ర్యాంకింగ్స్–26లో మదనపల్లి దగ్గర అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీకి 4ఏ రేటింగ్ దక్కినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల అనుసంధానం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు వంటి కీలక అంశాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనంలో జాతీయస్ఠాయిలో ఈ అరుదైన గుర్తింపు లభించడానికి కారణమైన సిబ్బందిని ఛాన్సలర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి అభినందించారు.
కష్టపడితే ఉన్నత
శిఖరాలకు చేరుకోవచ్చు
కడప కోటిరెడ్డి సర్కిల్ : విద్యార్థులు బట్టీ చదువులకు పరిమితం కాకుండా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని భారతీయ రైల్వేస్ నాగపూర్ జాయింట్ జనరల్ మేనేజర్ గాలి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం తొగటవీరక్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కింద నగదు, మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం మార్కులు మాత్రమే సాధించడం కాకుండా జ్ఞానం, నైపుణ్యాలు, ఆలోచన సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించుకోవడం అవసరమన్నారు. విద్య అనేది జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని, ఏ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వారైనా విద్య ద్వారా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. సంఘం నగర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కల్యా సుధాకర్, పల్లా నరసింహారావు మాట్లాడారు. కార్యక్రమంలో తాలూకా సీఐ నరసింహరాజు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు నాగరాజు, ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం, కోశాధికారి టేకూరు సుదర్శన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పల్లా మురళీకృష్ణయ్య, ఉపాధ్యక్షుడు చౌడం సూరిబాబు పాల్గొన్నారు.


