జమ్మలమడుగు : గండికోట, మైలవరం జలాశయాల్లో నీరు తగ్గిపోతుంది.రెండు నెలల కిందట గండికోటలో 20 టీఎంసీలు నిల్వ ఉండటంతో దిగువన ఉన్న మైలవరం జలాశయం, పైడిపాలెం, సర్వరాయసాగర్ ప్రాజెక్టులకు గండికోట ద్వారా నీటిని విడుదల చేశారు.దీంతో గండికోట జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ప్రస్తుతం గండికోటప్రాజెక్టులో 17టీఎంసీల నీరు నిల్వ ఉంది. మైలవరం జలాశయంలో నీటి సామర్థ్యం 6.5టీఎంసీగా ఉంది. మైలవరం జలాశయం నుంచి ఉత్తర, దక్షిణ కాలువలతోపాటు ఆర్టీపీపీ తాగునీటి అవసరాలకోసం జమ్మలమడుగు పెన్నానదిలోనికి నీటిని విడుదల చేశారు.ప్రస్తుతం మైలవరం జలాశయంలో1658 టీఎంసీలు మాత్రమే మిగిలింది. బొమ్మెపల్లి ఎత్తిపోతల పథకానికి 28 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరి కొద్దిరోజులపాటు సరైన వర్షాలు పడకపోతే మైలవరం జలాశయం అడుగంటిపోవడంతోపాటు ఖరీఫ్‌లో రైతులు పంట సాగుచేస్తే నీరు వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు.


