‘సర్‌’సరా.. సాగుతోంది! | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’సరా.. సాగుతోంది!

Jun 15 2026 1:17 AM | Updated on Jun 15 2026 1:17 AM

ఓటర్ల మ్యాపింగ్‌ సర్వే జోరు

జమ్మలమడుగు: జిల్లాలో ఓటర్ల జాబితా ల్యాండ్‌ మ్యాపింగ్‌ మరియు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రోగ్రాం (సర్‌) అత్యంత వేగంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో బూత్‌ స్థాయి అధికారులు 2002 నుండి 2025 వరకు ఉన్న పాత ఓటర్ల జాబితాతో ప్రస్తుతం ఉన్న డేటాను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్‌ ప్రక్రియను ముమ్మరం చేశారు. జూన్‌ 13వ తేదీ నాటికి జిల్లావ్యాప్తంగా 74.26 శాతం మేర ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు జూన్‌ 15వ తేదీ సోమవారం నుంచి జూలై 15 వరకు ఒక నెల రోజుల పాటు బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు.

ఇంకా 4.25 లక్షల మందికి పైగా మ్యాపింగ్‌

అవసరం!

ప్రింటెడ్‌ జాబితా పంపిణీ..

2002 రికార్డులతో నిఘా

సోమవారం నుండి క్షేత్రస్థాయికి వెళ్లే బీఎల్‌ఓలు తాము మ్యాపింగ్‌ చేసిన ఓటర్ల జాబితాను ప్రింట్‌ తీసి నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దే అందజేస్తారు. 2002లో ఓటు హక్కు లేని వారు కూడా ఈ సర్వే ద్వారా తమ స్థానికతను నిరూపించుకోవచ్చు. తమ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? 2002 నాటికి వారు ఎక్కడ నివాసం ఉన్నారో తెలియజేస్తూ సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అధికారులు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ గతంలో ఓటు హక్కు ఉండి, ప్రస్తుతం జాబితాలో పేరు లేకపోతే.. ‘మీకు ఓటు హక్కు ఎందుకు తొలగించబడింది? కారణాలు ఏమిటి?‘ అనే విషయాలపై బీఎల్‌ఓలు లోతుగా ఆరా తీస్తారు. ఈ సర్వే ద్వారా ఓటర్ల లిస్టులో ఉన్న అక్షరదోషాలు, తప్పు అడ్రసులు, వయసు మరియు ఫొటోలకు సంబంధించిన తప్పు ఒప్పులను సరిదిద్దుకోవచ్చు. అలాగే డూప్లికేట్‌ (బోగస్‌) ఓట్లను మరియు చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి పూర్తిగా తొలగిస్తారు.

అధికారుల సన్నద్ధత..

నూతన నమోదుకు 30 రోజుల ఛాన్స్‌!

బీఎల్‌ఓలు క్షేత్రస్థాయి సర్వే సజావుగా నిర్వహించడానికి వీలుగా జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష చేతుల మీదుగా గొడుగు, టోపీ, వాటర్‌ బాటిల్‌, రైటింగ్‌ ప్యాడ్‌, స్కేల్‌, పెన్సిల్‌, రబ్బరు వంటి 13 రకాల వస్తువులతో కూడిన కిట్లను అధికారులకు అందజేశారు. సర్వేలో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవాలని ఆమె హెచ్చరించారు. బీఎల్‌ఓలు సేకరించిన డేటా ఆధారంగా తయారుచేసే ఓటర్ల నూతన జాబితాను ప్రభుత్వం పోలింగ్‌ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలలో ఆన్‌లైన్‌లో ఉంచుతుంది. ఈ జాబితాలో పేర్లు లేని వారు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడం కోసం ప్రభుత్వం 30 రోజుల పాటు ప్రత్యేక సమయాన్ని కేటాయించనుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వైఎస్సార్‌సీపీతో పాటు కూటమి నాయకులు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను రంగంలోకి దించారు.

కడప జిల్లాలో 74.26% పూర్తి

13 రకాల కిట్లతో నేటి నుంచి

ఇంటింటికీ బీఎల్‌ఓలు

వైఎస్సార్‌ కడప జిల్లా ఓటర్ల మ్యాపింగ్‌ ‘సర్‌’ వివరాలు

నియోజకవర్గం మొత్తం ఓటర్లు మ్యాపింగ్‌ పూర్తి శాతం ఇంకా చేయాల్సినవి

బద్వేలు 2,22,043 1,69,454 76.32% 52,589

కడప 2,83,973 1,89,288 66.66% 94,685

పులివెందుల 2,30,276 1,82,535 79.27% 47,741

కమలాపురం 2,06,701 1,69,240 81.88% 37,461 (టాప్‌)

జమ్మలమడుగు 2,45,095 1,87,471 76.49% 57,624

ప్రొద్దుటూరు 2,50,513 1,63,594 65.30% 86,919 (లీస్ట్‌)

మైదుకూరు 2,13,852 1,65,538 77.41% 48,314

మొత్తం 16,52,453 12,27,120 74.26% 4,25,333

ముఖ్యాంశాలు: జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా కమలాపురం (81.88%),

అత్యంత తక్కువగా ప్రొద్దుటూరు (65.30%) నమోదు.

(ఈనెల 13వతేదీ నాటికి మ్యాపింగ్‌ అయిన డేటా)

జిల్లాలోని మొత్తం ఓటర్లు :

16,52,453 మంది

ఇప్పటివరకు పూర్తయిన మ్యాపింగ్‌ :

12,27,120 మంది

74.26 శాతం

ఇంకా చేయాల్సిన మ్యాపింగ్‌ :

4,25,333 మంది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement