భయపడుతున్న మహిళలు, విద్యార్థులు
బద్వేలు: పట్టణ కేంద్రంలోనే ఉన్నా పగలే నిర్మానుష్య వాతావరణం.. చీకటి పడితే పోకిరీలకు కొండంత అండ.. ఇదీ బద్వేలు మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుగంగ కాలనీ క్వార్టర్ల ప్రస్తుత దయనీయ స్థితి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలతో కళకళలాడిన ఈ ప్రభుత్వ భవనాలు, రెండు దశాబ్దాలుగా పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు నయా అడ్డాగా మారాయి.
విద్యాసంస్థలు, మున్సిపాలిటీ
ఆఫీస్ నడుమ ఘోరం
ఈ శిథిలావస్థకు చేరుకున్న తెలుగుగంగ క్వార్టర్లు పట్టణంలోని అత్యంత కీలకమైన ప్రాంతాల మధ్య ఉండటం గమనార్హం. ఒకవైపు ప్రముఖ బిజివేముల వీరారెడ్డి విద్యాసంస్థల ప్రాంగణం, మరోవైపు తెలుగుగంగ ప్రధాన రహదారి వీధి.. ఇంకోవైపు అత్యంత సమీపంలోనే బద్వేలు మున్సిపాలిటీ కార్యాలయ సముదాయం ఉన్నాయి. ఇంతటి ముఖ్యమైన లొకేషన్లలో ఉన్నప్పటికీ, ఈ సువిశాల ఖాళీ స్థలం పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ నిర్మానుష్యంగానే ఉంటుంది. క్వార్టర్ల చుట్టూ ఖాళీ స్థలం అధికంగా ఉండటంతో కంపచెట్లు విపరీతంగా పెరిగి చూడటానికి ఒక ‘చిట్టడవి’లా తయారైంది. ఈ చిట్టడవే ప్రస్తుతం మందుబాబులకు, పేకాట రాయుళ్లకు ప్రత్యేక రక్షణ వలయంలా ఉపయోగపడుతోంది.
గదుల నిండా మద్యం బాటిళ్లు..
గంజాయి, వ్యభిచారం కలకలం!
తెలుగుగంగ కాలనీలో నిర్మించిన ఈ 30కి పైగా క్వార్టర్ల భవనాలలో ఒక్కో దానికి ఐదారు గదులు ఉన్నాయి. ఈ విశాలమైన గదుల వసతి పోకిరీలకు మరింత సౌకర్యంగా మారింది. భవనాల గదుల లోపల, పైన ఎటు చూసినా ఖాళీ మద్యం బాటిళ్లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. కొందరు పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఇక్కడ చేరి మద్యం సేవిస్తూ, పేకాట జోరుగా సాగిస్తున్నారు. ఈ పాడుపడిన క్వార్టర్లను ఆవాసాలుగా చేసుకుని కొందరు వ్యభిచారం కూడా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు కొందరు రిక్షా కార్మికులు, ఆకతాయిలు ఇక్కడికి వచ్చి గంజాయి తాగుతూ డ్రగ్స్ దందాకు కూడా తెరలేపుతున్నారు.
పోలీసుల గస్తీ.. శూన్యం!
దారుణాలపై స్థానిక కాలనీవాసులు పలుమార్లు పోలీసులకు గట్టిగా ఫిర్యాదులు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన ఒకటి రెండు రోజులు మాత్రం పోలీసులు ఆ ప్రాంతంలో మొక్కుబడిగా గస్తీ నిర్వహించి, ఆ తర్వాత మళ్లీ అటువైపు వెళ్లడం మానేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసుల గస్తీ నిలిచిపోవడంతో అల్లరి మూకలు మళ్లీ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, ఆ కంపచెట్లను పూర్తిగా తొలగించి, అక్కడ పటిష్టమైన పోలీసు నిఘా మరియు శాశ్వత గస్తీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
బద్వేలు నడిబొడ్డున అసాంఘిక
కార్యక్రమాలు
మున్సిపల్ ఆఫీస్ పక్కనే పోకిరీల రాజ్యం
కాలనీలో మద్యం, వ్యభిచారం,
గంజాయి జోరు
D M>ÓÆý‡t-ÆŠ‡ÞMýS$ çÜÒ$-ç³…ÌZ¯ól ™ðlË$-VýS$-VýS…VýS Æøyýl$z M>ÌS-±, ÒÆ>-Æð‡yìlz 1, 2 M>ÌS± {ç³fÌS °Ðé-ÝëË$ E¯é²Æ‡$$. CMýSPyìl MýS$r$…»êÌSMýS$ ^ðl…¨¯]l í³ÌSÏË$, Ð]l$íßæ-âýæË$ {ç³†Æøþ D ¿ýæÄ¶æ*-¯]lMýS M>ÓÆý‡tÆý‡Ï Ò$§ýl$-V>¯ól ™èlÐ]l$ ѧéÅçÜ…çܦ-ÌSMýS$, 糯]l$-ÌSMýS$ वे-âêÏÍÞ E…r$…-¨. AMýSPyýl °Æý‡…-™èlÆý‡… †ÇVóS AÌSÏÇ Ð]lÊMýS-ÌS¯]l$, AÝë…íœ$MýS ÔèæMýS$¢-ÌS¯]l$ ^èl*íÜ Ñ§éÅ-Æý‡$¦Ë$, ÝëÐ]l*¯]lÅ {ç³fË$ ¡{Ð]l ¿ýæÄ¶æ*…§ø-âýæ-¯]l-ÌSMýS$, Cº¾…§ýl$ÌSMýS$ VýS$Æý‡-Ð]l#-™èl$-¯é²Æý‡$.


