నెల్లూరు, కర్నూలు జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం

Feb 17 2026 7:50 AM | Updated on Feb 17 2026 7:50 AM

నెల్ల

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–12 సౌత్‌జోన్‌ అంతర్‌ జిల్లాల వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. సోమవారం వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం–నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. జట్టులోని ఓ. మోనిష్‌ 59, భరద్వాజ్‌ 52, జాన్సన్‌ 47 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని అఖిల్‌ గౌడ్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన అనంతపురం జట్టు 20.4 ఓవర్లకు 98 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని గోవర్ధన్‌ 30, హాన్సిక్‌రెడ్డి 13 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని ఆశ్విన్‌ రాణా 4 వికెట్లు, గురు 3 వికెట్లు తీశాడు. దీంతో నెల్లూరు జట్టు 126 పరుగులతో విజయం సాధించింది.

కెఎఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కర్నూలు–చిత్తూరు జట్లు తలపడ్డాయి, టాస్‌గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 35 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. జట్టులోని గౌతమ్‌రెడ్డి 68, రుత్విక్‌రెడ్డి 51 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని పునిత్‌ సాయి రెడ్డి 2 వికెట్లు, చరిత్‌ 2 వికెట్లు తీశారు, అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు 35 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఆజట్టులోని ధనుష్‌ 83 బంతుల్లో 19 ఫోర్లతో 100 (సెంచరీ) చేశాడు. కె.ఇ గోకుల్‌ సాయి 49 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని సూర్య 3 వికెట్లు తీశాడు. దీంతో కర్నూలు జట్టు 2 పరుగులతో విజయం సాధించింది. మంగళవారం వైఎస్‌ఆర్‌ఆర్‌ కిక్రెట్‌ స్డేడియంలో కడప–చిత్తూరు. కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో అనంతపురం–కర్నూలు జట్లు తలపడనున్నాయి.

లంకమల అభయారణ్యంలో వ్యక్తి మృతి

సిద్దవటం : మండలంలోని పొన్నవోలు గ్రామ పంచాయతీ వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఈరిశెట్టి వెంకటసుబ్బయ్య (53) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈయన ఆదివారం మహాశివరాత్రికి బద్వేల్‌ సమీపంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ లంక మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చేందుకు బస్సులో కూర్చొని సీటులోనే కుప్పకూలి మృతిచెందాడు. మృతదేహాన్ని బస్సులో బద్వేలుకు తరలించారు. కుటుంబీకులు సోమవారం మృతదేహాన్ని వెంకటాయపల్లి గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

పొలతల క్షేత్రంలో గుర్తుతెలియని వ్యక్తి...

పెండ్లిమర్రి : పొలతల శైవ క్షేత్రంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఇతనికి దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు, ఒంటిపై తెల్లని మాసిపొయిన చొక్కా, గళ్ళ లుంగి ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే పెండ్లిమర్రి పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ తెలియజేశారు. 9121100527 నంబర్‌కు కాల్‌ చేయాలని తెలిపారు.

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం
1
1/6

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం
2
2/6

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం
3
3/6

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం
4
4/6

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం
5
5/6

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం
6
6/6

నెల్లూరు, కర్నూలు జట్ల విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement