రక్తదాన శిబిరానికి స్పందన | - | Sakshi
Sakshi News home page

రక్తదాన శిబిరానికి స్పందన

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

పెందుర్తి : ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అమృత విద్యాసంస్థలు, లైఫ్‌ షేర్‌ బ్లడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దాదాపు 30 యూనిట్లు రక్తాన్ని రక్తదాల నుంచి సేకరించారు. రక్తదానం విశిష్టతను వివరించారు. రక్తం దానం చేసిన తర్వాత మళ్లీ కొత్త రక్తం వస్తుందని, ఎలాంటి అపోహలు పడొద్దని హాజరైన విద్యార్థులకు, సిబ్బందికి తెలిపారు. రక్తదానం అన్నిదానాల్లో కల్లా గొప్పదని తెలిపారు. సమయానికి రక్తం లేక కొన్ని లక్షల ప్రాణాలు పోవడం గమనిస్తున్నామని, రక్తం దానం చేసిన తరువాత మళ్లీ కొత్త రక్తం వస్తుందని.. మళ్లీ మళ్లీ దానం చేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో పెందుర్తి పోలీసులు, అమృత విద్యాసంస్థల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్దులు,లైఫ్‌ షేర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement