స్టీల్‌ప్లాంట్ పరిస్థితి దృష్ట్యా గతేడాది నా తండ్రి వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు తిరస్కరించారు. 1991 నుంచి స్టీల్‌ప్లాంట్ సెంట్రల్ మెకానిక్ మెయింట్‌నెన్స్‌లో పనిచేసిన నా తండ్రిని, ఏడాది కిందటే ఆ విభాగం నుంచి ఎస్ఎమ్ఎస్–2కి బదిలీ చేశారు. ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా, కనీస భద్రతా ప్రమాణాలు లేనిచోటుకి పంపించారు. కుటుంబానికి దికై ్కన తండ్రిని కోల్పోయిన తాము ఇప్పుడు ఏమైపోవాలి. అమ్మ సూర్యకుమారి గృహిణి. చెల్లి దీపిక ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. వారిని సముదాయించడం నా వల్ల కావడం లేదు.
– హనీష్, మృతుడు కృష్ణ కుమారుడు


