స్టీల్‌ప్లాంట్‌ క్షతగాత్రులను పరామర్శ | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ క్షతగాత్రులను పరామర్శ

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

గాజువాక/అక్కిరెడ్డిపాలెం : స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో గాయపడి కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన, చికిత్స ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అలాగే కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా క్షతగాత్రులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ఎంపీ భరత్‌, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement