స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద స్థలం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద స్థలం పరిశీలన

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

ఉక్కునగరం: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ మంగళవారం స్టీల్‌ప్లాంట్‌లోని స్టీల్‌ మెల్ట్‌ షాప్‌ను సందర్శించారు. ఇక్కడి సీసీడీ సెక్షన్‌కు వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అక్కడి అధికారులు ఆయనకు ప్రమాదం గురించి వివరించారు. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగాయా? అంటూ వాకబు చేశారు. అక్కడి అధికారులు, కార్మికులతో మాట్లాడారు. అనంతరం మెయిన్‌ గేటు వద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, విశాఖ ఎంపీ శ్రీభరత్‌, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, గాజువాక కన్వీనర్‌ కరణంరెడ్డి నర్సింగరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement