నిర్మాణ కార్మికులకు ఐదు సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ కార్మికులకు ఐదు సంక్షేమ పథకాలు

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

8లో

2.0 కోసం ఈ నెలలోనే కన్సల్టేషన్‌ ప్రక్రియ

రాబోయే ఐదారేళ్లకు నిర్దేశించిన వృద్ధి రేటు విషయంలో పరిశ్రమల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. నిబంధనల సడలింపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. స్థానిక ముడిసరుకులకు విలువ జోడించడమే పీఎల్‌ఐ స్కీమ్‌ ప్రధాన ఉద్దేశం. పీఎల్‌ఐ 1.0లోని సమస్యల్ని పరిష్కరిస్తూ 2.0 అమలు కోసం ఈ నెలలోనే పరిశ్రమల భాగస్వామ్యంతో కన్సల్టేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిపై పరిశ్రమలు సరైన ప్రణాళికతో రావాలని సూచించాం.

– డి.ప్రవీణ్‌, కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌

మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ

విలువ ఆధారిత ఉత్పత్తులదే భవిష్యత్తు

చేపల ప్రాసెసింగ్‌ సమయంలో మిగిలిపోయే వ్యర్థాలను చెత్తగా చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతికతతో ఈ వ్యర్థాలు అత్యంత విలువైన వనరుగా మారుతున్నాయి. ఈ విధానం పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తోంది. సాధారణంగా పారేసే చేపల చర్మం నుంచి సేకరించే కొల్లాజెన్‌(పొలుసు)ను ప్రస్తుతం సౌందర్య సాధనాల తయారీకి వినియోగిస్తున్నాం. ఫిష్‌ స్కిన్‌తో బెల్ట్‌లు, షూలు తయారు చేయడం, బోన్స్‌ నుంచి వచ్చే ఉత్పత్తులకు మార్కెట్‌ అద్భుతంగా ఉంది. మీట్‌ కంటే వాల్యూ ఎడిషన్‌ కే భవిష్యత్తు ఉంది. పీఎల్‌ఐ 2.0 అమలైతే ఎంఎస్‌ఎంఈలకు ఎంతో ఉపయోగం ఉంటుంది.

– కేదార్‌నాథ్‌ రెడ్డి, షష్మి ఫుడ్స్‌ ఎండీ

ఎంఎస్‌ఎంఈలకు

ఊతమిచ్చేలా పీఎల్‌ఐ 2.0

ప్రస్తుత పీఎల్‌ఐ(ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌)లో లోపాలను సరిదిద్దుతూ, సముద్ర ఉత్పత్తులు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వీలుగా ప్రత్యేకమైన కస్టమైజ్డ్‌ పీఎల్‌ఐను తీసుకురాబోతున్నారు. ఇందులో ఎంఎస్‌ఎంఈలకు అనుకూలంగా పెట్టుబడి, టర్నోవర్‌ నిబంధనలను సడలించనున్నారు. 2030 నాటికి వాల్యూ యాడెడ్‌ ఉత్పత్తుల ఎగుమతుల వాటాను ప్రస్తుత 10 శాతం నుంచి 25 శాతానికి పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 659 ప్రాసెసింగ్‌ యూనిట్లలో కేవలం 127 మాత్రమే వాల్యూ ఎడిషన్‌ (వీఏపీ) యూనిట్లున్నాయి. ఈ యూనిట్లలో అత్యధికంగా ఏపీలో 42 యూనిట్లు, కేరళలో 25 యూనిట్లు ముందంజలో ఉన్నాయి. భవిష్యత్‌ కార్యాచరణ కోసం కేంద్ర వాణిజ్య శాఖ, ఎంపెడా, మత్స్య, ఫుడ్‌ప్రాసెసింగ్‌ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. కిలో 15 డాలర్లు పలికే సషిమి టూనా, 10–12 డాలర్లు పలికే సుషీ/బ్రెడెడ్‌ రొయ్యలు, 10 డాలర్లకు పైగా విలువైన సీవీడ్‌/న్యూట్రాస్యూటికల్స్‌ని అభివృద్ధి చేసేందుకు ముందుగా పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇలాంటి ప్రత్యేక ఉత్పత్తులకు 20 శాతం, హైరిస్క్‌ హైవాల్యూ ఉత్పత్తులకు 15 శాతం, ఇతర వీఏపీలకు 6 శాతం ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తున్నారు. పీఎల్‌ఐ–2.0 ద్వారా అటు మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, ఎంఎస్‌ఎంఈలకు ఊతం లభించి గ్లోబల్‌ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల వాటా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

హరిత వృద్ధిలో భారత్‌ అగ్రగామిగా ఎదుగుతోంది

గణాంకాలు..

ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల వాణిజ్యం

218.37 బిలియన్‌ డాలర్లు

భారత్‌ వాటా – 3.87 శాతం(8.46 బిలియన్‌ డాలర్లు)

భారత్‌ నుంచి ఎగుమతవుతున్న విలువ

ఆధారిత ఉత్పత్తులు– 928.91 మిలియన్‌ డాలర్లు

ఎక్కువగా ఎగమతవుతున్న కుక్డ్‌/బ్రెడెడ్‌/

మారినేటెడ్‌ రొయ్యల వాటా– 80.64 శాతం

వాల్యూయాడెడ్‌ ఉత్పత్తుల ప్రపంచ మార్కెట్‌–

35 బిలియన్‌ డాలర్లు

భారత్‌ వాటా – 0.84 బిలియన్‌ డార్లు

వీఏపీ ఎగుమతుల్లో భారత్‌ స్థానం– 10వ స్థానం

నిబంధనలే శరాఘాతం

2021–22 నుంచి 2026–27 వరకూ రూ.10,900 కోట్ల బడ్జెట్‌తో అమలవుతున్న ప్రస్తుత పీఎల్‌ఐ పథకంలో చిన్న పరిశ్రమలకు చోటు దక్కలేదు. దేశవ్యాప్తంగా ఉన్న 658 ప్రాసెసింగ్‌ యూనిట్లలో 524 (80 శాతం)ఎంఎస్‌ఎంఈలే ఉన్నాయి. కనీస టర్నోవర్‌ రూ.600 కోట్లు ఉండాలనే నిబంధన కారణంగా ఒక్క ఎంఎస్‌ఎంఈ కూడా పీఎల్‌ఐకి అర్హత సాధించలేకపోయింది. కేవలం 9 మంది మాత్రమే దీని ప్రయోజనాలు పొందారు. మరోవైపు దేశంలోని పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో కేవలం 40 శాతం మాత్రమే వినియోగిస్తుండగా, మిగిలిన 60 శాతం వృథా అవుతోందని గుర్తించారు. ఈ కారణంగా రూ.9,500 కోట్లు వరకూ నిధులు ప్రభుత్వ ఖాతాల్లోనే మురుగుతున్నాయి. నిబంధనలు సడలించాలని ఎంఎస్‌ఎంఈలు, సహకార సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి.దీంతో కేంద్రం నిబంధనల సడలింపుపై కసరత్తు ప్రారంభించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement