డాబాగార్డెన్స్: యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ముందుగా యూనియన్ మహాసభను నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ నూతన కమిటీ అధ్యక్షురాలిగా ఎస్.సుభాషిణి, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కృష్ణమోహన్, గౌరవ అధ్యక్షురాలిగా పి.మణి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జి.రాము, ఎన్నికయ్యారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిట్టిబాబు, కోశాధికారిగా సుమలత, గౌరవ సలహాదారులుగా జీఎస్ రాజేశ్వరరావు, రమణారెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఉపాధ్యక్షులుగా సుధాకర్, ప్రసాద్, కేవీ పద్మావతి, రామయ్యమ్మ, రమణ, జాయింట్ సెక్రటరీలుగా రాజ్యలక్ష్మి, భార్గవి, రాధా, బుల్లాకి, దేవకుమారి, శివలక్ష్మి, ఎర్రమ్మ ఎన్నిక, కార్యదర్శులుగా టి.కల్యాణమ్మ, ఈశ్వరరావు, శైలజ, భాగ్యలక్ష్మి, రమణ, వెంకటేష్ ఎన్నికయ్యారు.


