కార్మికులకు వివాహం నుంచి ప్రసూతి వరకు ఆర్థిక సాయం నిర్మాణ కార్మికులకు అండగా సంక్షేమ బోర్డు | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు వివాహం నుంచి ప్రసూతి వరకు ఆర్థిక సాయం నిర్మాణ కార్మికులకు అండగా సంక్షేమ బోర్డు

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

సీతంపేట: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పలు పథకాలను అమలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచే ఈ నూతన సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ ప్రారంభమైంది. బోర్డులో నమోదైన 18 నుంచి 60 ఏళ్ల వయస్సు గల అర్హులైన కార్మికులు ఈ లబ్ధిని పొందవచ్చు. వివాహ కానుక, ప్రసూతి సాయం కింద రూ. 20,000 చొప్పున, సహజ మరణ ఉపశమనంగా రూ. 60,000, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 20,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వీటితో పాటు కార్మికులకు ఉచిత భోజనం, స్టైపెండ్‌తో కూడిన 15 రోజుల వృత్తి నైపుణ్య శిక్షణను కూడా ఇస్తున్నారు. ఆయా పథకాలకు అర్హులైన కార్మికులు తమ ఆధార్‌, లేబర్‌ కార్డ్‌, బ్యాంకు వివరాలతో సమీప కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు.

1. వివాహ కానుక : రూ. 20,000

హిళా కార్మికురాలి వివాహానికి, కార్మికుడు/కార్మికురాలి ఇద్దరి కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం. కార్మికుడిగా రిజిష్టర్‌ అయిన ఏడాది తరువాత ఈ పథకం వర్తిస్తుంది.

దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు

భవన నిర్మాణ కార్మికుని / కార్మికురాలు, పెళ్లి కుమార్తె ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, వివాహా ధ్రువీకరణ పత్రం (ఏపీ సేవ పోర్టర్‌లో పొందినది తప్పని సరిగా ఉండాలి), బ్యాంక్‌ పాస్‌ పుస్తకం మొదటి పేజి జిరాక్స్‌, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు , అప్డేట్‌ రెన్యూవల్‌ రశీదులు జిరాక్సులు జతపర్చాలి.

2.ప్రసూతి సహాయం : రూ. 20,000

కార్మికుని భార్య , వారి కుమార్తెలకు, మహిళా కార్మికులకు ప్రసూతి ఆర్థిక సహాయం, కార్మికుడు రిజిష్టర్‌ అయిన ఏడాది తరువాత ఈ పథకం వర్తిస్తుంది.

దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు

భవన నిర్మాణ కార్మికుని, ప్రసూతి సహాయం పొందే మహిళ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, కాన్పు సర్టిఫికెట్‌, జనన ధ్రవీకరణ పత్రం, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం మొదటి పేజి జిరాక్స్‌, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, అప్డేట్‌ రెన్యూవల్‌ రశీదుల జిరాక్సు జతపర్చాలి.

3. సహజ మరణ ఉపశమన పథకం: రూ. 60,000

హజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు

మృతి చెందిన వ్యక్తి..నామిని, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, ఆప్‌డేట్‌ రెన్యూవల్‌ రశీదులు జిరాక్సు, ఏపీ సేవా పోర్టర్‌ ద్వారా జారి చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, నామిని బ్యాంక్‌ పాస్‌ పుస్తకం మొదటి పేజి జిరాక్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ సర్టిఫికెట్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌ జతచేయాలి.

4. అంత్యక్రియలకు వ్యయ సహాయ పథకం / మట్టి ఖర్చులకు సహాయం: రూ. 20,000

రణించిన కార్మికుల అంతిమ సంస్కారాలకు ఆర్థిక సహాయం

దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు

మరణించిన వ్యక్తికి సంబంధించిన నామిని ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, అప్డేట్‌ రెన్యూవల్‌ రశీదులు జిరాక్స్‌, ఏపీ సేవా పోర్టర్‌ ద్వారా జారి చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, నామిని బ్యాంక్‌, పాన్‌ పుస్తకం మొదటి పేజి జిరాక్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ సర్టిఫికెట్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌, ఎఫ్‌వీఆర్‌, పంచనామా జిరాక్స్‌ కాపీ (ప్రమాద మరణానికి వర్తిస్తుంది), మెడికల్‌ సర్టిఫికెట్‌ (ప్రమాద మరణానికి వర్తిస్తుంది) జతపర్చాల్సి ఉంటుంది.

5. కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ

రిజిస్టర్‌ అయిన భవన నిర్మాణ కార్మికులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు 15 రోజులు శిక్షణ, ఉచిత భోజన సౌకర్యాలతో పాటు రోజుకు రూ. 300 చొప్పున భృతి చెల్లింపు

భవన నిర్మాణ కార్మికుడిగా

నమోదు చేసుకునేందుకు కావలసిన పత్రాలు

కార్మికుడు/ కార్మికురాలు వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వారు నమోదుకు అర్హులు. అప్లికేషన్‌ ఫారం, స్వీయ ధ్రువీకరణ పత్రం, 2 పాస్‌ పోర్టు సైజు కలర్‌ ఫొటోలు, కార్మికుని ఆధార్‌ కార్డు జిరాక్స్‌,. నామిని, కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డు జిరాక్స్‌, కార్మికుని బ్యాంక్‌ అకౌంట్‌ మొదటి పేజి జిరాక్స్‌, రూ. 110లు చెల్లించిన యూనియన్‌ బ్యాంక్‌ చలానా అవసరం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement