న్యూస్‌రీల్
4 పోర్టులు, కీలక వర్క్‌షాప్‌లు, లోకోషెడ్లతో ఆదాయార్జనకు ఊతం ఏటా రూ.20 వేల కోట్ల వరకు రాబడికి అవకాశం రైళ్ల నిర్వహణ, మరమ్మతులకు స్వయం సమృద్ధి దిశగా అడుగులు జోనల్ హాస్పిటల్, టౌన్‌షిప్‌తో మౌలిక సదుపాయాల విస్తరణ
రైళ్ల నిర్వహణలో ఎలాంటి లోటు లేకుండా జోన్‌కు 17 కీలక వర్క్‌షాప్‌లు, లోకోషెడ్లు, కోచింగ్ డిపోలు దక్కనున్నాయి.
● వాల్తేరు, విజయవాడ, గుంతకల్లులోని 3 ఎలక్ట్రిక్ లోకో షెడ్లు
● వాల్తేరు, గుత్తి, గుంతకల్లు, విజయవాడలోని 4 డీజిల్ లోకోషెడ్లు
● తిరుపతిలోని కోచ్ వర్క్‌షాప్, వడ్లపూడి,రాయనపాడులోని వ్యాగన్ వర్క్‌షాప్‌లు
● వాల్తేరు, విజయవాడ, గుత్తి, కాకినాడ పోర్టులోని 4 మేజర్ ఫ్రైట్ ఎగ్జామినేషన్ యార్డులు
● వాల్తేరు, తిరుపతి, విజయవాడ, కాకినాడ పోర్టు, నర్సాపూర్, మచిలీపట్నం, గుంటూరులోని 7 కోచింగ్ డిపోలు
● ట్రాక్ మెషీన్ వర్క్‌షాప్ కింద రాయనపాడులోని సెంట్రల్ పీవోహెచ్ వర్క్‌షాప్, జోనల్ ట్రాక్ మెషీన్ డిపో
● రాజమండ్రిలోని మెమూ కార్‌షెడ్ కూడా జోన్ పరిధిలోకే రానుంది.
● విజయవాడలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ రన్నింగ్ స్టాఫ్(ఈటీటీసీ), గుంతకల్లులోని డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్(డీటీటీసీ) జోన్‌కు రానుంది.
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026
జోన్ తాత్కాలిక కార్యాలయం
గవర్నర్‌కు ఘన స్వాగతం
మహారాణిపేట: సంగివలసలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌కు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని పూర్తిచేసుకొని సాయంత్రం గవర్నర్ విశాఖ విమానాశ్రయం నుంచి విమానంలో విజయవాడకు బయలుదేరారు.
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కీలక శక్తిగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. సరుకు రవాణాకు జీవనాడిగా నిలిచే నాలుగు ప్రధాన పోర్టులు, రైళ్ల నిర్వహణకు వెన్నెముకలైన లోకోషెడ్లు–వర్క్‌షాప్‌లు, వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు జోన్ పరిధిలోకి రానుండటంతో విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న ఈ జోన్ ఆర్థికంగా, పరిపాలనా పరంగా మరింత బలోపేతం కానుంది. వార్షికంగా రూ.17,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో పాటు విశాఖ డివిజన్‌లోని కీలక ఆస్తులు, సదుపాయాలు జోన్‌లో విలీనం కానున్నాయి. రైళ్ల నిర్వహణ, మరమ్మతులు, సరుకు రవాణా, సాంకేతిక శిక్షణ తదితర అంశాల్లో ఇతర జోన్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధించేలా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రూపుదిద్దుకుంటోంది.
జోన్‌కు 4 పోర్టుల బలం
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆదాయానికి ప్రధాన ఆధారంగా నిలిచే 4 కీలక ఓడరేవులు పూర్తిగా ఈ జోన్ పరిపాలనా నియంత్రణలోకి రానున్నాయి. విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వా రా భారీ స్థాయిలో సరుకు రవాణా జరుగుతోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం జోన్‌కు ఆర్థిక బలాన్ని చేకూర్చనుంది. గూడ్స్ రైళ్ల తనిఖీలు, నిర్వహణ కోసం వాల్తేరు, విజయవాడ, గుత్తి, కాకినాడ పోర్టుల వద్ద ఉన్న నాలుగు మేజర్ ఫ్రైట్ ఎగ్జామినేషన్ యార్డులు కూడా జోన్ పరిధిలోకి రానున్నాయి.
వర్క్‌షాప్‌లు, లోకోషెడ్లతో స్వయం సమృద్ధి
రోబోటిక్ సర్జరీతో మెరుగైన క్యాన్సర్ వైద్యం
ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం
విశాఖలో ఉన్న శాటిలైట్ డిపో ఫర్ ట్రాక్ మెషీన్స్ విశాఖ డివిజన్ పరిధిలోనే ఉంటుంది. రాయగడకు బదిలీ చేసినవి మినహాయిస్తే మిగిలిన 3 ఆపరేటింగ్ సెక్షన్ కంట్రోల్స్, ఒక టీపీసీ సెక్షన్ బోర్డు, ఇంజనీరింగ్, సీ అండ్ డబ్ల్యూ, సెక్యూరిటీ కంట్రోల్ విభాగాలు కూడా విశాఖ డివిజన్‌లోనే ఉంటాయి. ఇలా.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ తన సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా విస్తరింపజేసుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. పోర్టుల ద్వారా సరుకు రవాణా, నిర్వహణా కేంద్రాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ద్వారా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏటా రూ.17,550 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేకే లైన్ కూడా జోన్‌లో విలీనం చేసి ఉంటే ఈ ఆదాయం రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల స్థాయికి చేరుకునేదని చెబుతున్నారు.
10న ఈఎస్‌ఐసీ ‘సువిధా సమాగమ్’
సీతంపేట: స్థానిక అక్కయ్యపాలెం నరసింహనగర్ రోడ్‌లోని ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) ఉప ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 10వ తేదీన ‘సువిధా సమాగమ్’ పేరిట ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి నెల రెండో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. బీమా పొందిన కార్మికులు, యజమానులు, లబ్ధిదారులు తమ ఈఎస్‌ఐ రిజిస్ట్రేషన్, చందాలు, క్లెయిమ్‌లు, మల్కాపురం ఈఎస్‌ఐ ఆసుపత్రి/డిస్పెన్సరీ వైద్య సేవలకు సంబంధించిన ఫిర్యాదులను ఇక్కడ నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. సమావేశానికి విశాఖపట్నం ఎస్‌ఆర్‌వో జాయింట్ డైరెక్టర్ ఇన్చార్జ్, మల్కాపురం ఈఎస్‌ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్, విజయవాడ ఐఎంఎస్ జాయింట్ డైరెక్టర్ హాజరై సమస్యలను తక్షణమే పరిష్కరిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 0891–2733126, bfts& vizag@esic.gov.inలో సంప్రదించాలన్నారు.


