మహారాణిపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీలో రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ, జిల్లా అనుబంధ విభాగ కమిటీ, నియోజకవర్గ అనుబంధ విభాగం కమిటీలో పలువురిని నియమించారు. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ
రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా మాటూరి చిన్నారావు (విశాఖ పశ్చిమ), రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ కార్యదర్శిగా డి.అప్పారావు (డేవిడ్‌రాజు) (గాజువాక), రాష్ట్ర వలంటీర్ విభాగం కార్యదర్శిగా కాళ్ల గౌరి (భీమిలి)ని నియమించారు.
జిల్లా అనుబంధ విభాగం కమిటీ
వైఎస్సార్‌సీపీ జిల్లా షేక్ విభాగం అధ్యక్షుడిగా మహమ్మద్ షరీఫుద్దీన్(విశాఖ సౌత్), జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా జామి కరుణ(విశాఖ నార్త్), జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్‌గా కాకినాడ పెంటారావు(గాజువాక), జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ముడుపు దామోదర్ రావు(గాజువాక), జిల్లా ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జల్లి బాబ్జి(గాజువాక), జిల్లా విద్యార్ధి విభాగం ప్రధాన కార్యదర్శిగా గార్లాంక మురళి(గాజువాక), జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా నీలకంటి సంతోష్‌కుమార్(భీమిలి), జిల్లా ఆర్‌టీఐ వింగ్ ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీవంశీ(గాజువాక), జిల్లా ఆర్‌టీఐ వింగ్ కార్యదర్శిగా సిరసపల్లి శ్రీనివాస్(గాజువాక), జిల్లా వలంటీర్స్ విభాగం కార్యదర్శిగా పేర్ల రాము(గాజువాక), జిల్లా రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా గొలజాన రవికుమార్(భీమిలి), జిల్లా గ్రీవెన్స్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా వాకాడ దుర్గా వెంకట ప్రసాద్ రెడ్డి(గాజువాక), జిల్లా పబ్లిక్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ధర్మాల దిలీప్ రెడ్డి(గాజువాక)ను నియమించారు.
నియోజకవర్గ అనుబంధ విభాగం
గాజువాక నియోజకవర్గ రజక విభాగం అధ్యక్షుడిగా నందవరపు సత్య భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ నూర్ భాష(దూదేకల) విభాగం అధ్యక్షుడిగా మహమ్మద్ సిరిరాజుద్ధిన్, విశాఖ దక్షిణ నియోజకవర్గ నాగవంశం విభాగం అధ్యక్షుడిగా కనకాల జగదీష్ కుమార్‌ను నియమించారు.


