మహారాణిపేట: విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారిగా సాదు దిలీప్ చక్రవర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. గతంలో డీఆర్‌వో భవానీ శంకర్‌పై పలు అవినీతి ఆరోపణలు రావడంతో పాటు ఆర్‌డీవో శ్రీలేఖ లేఖ రాసిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి డీఆర్‌వో భవానీ శంకర్‌తో పాటు అప్పటి ఆర్‌డీవో పి. శ్రీలేఖను బదిలీ చేసింది. నాటి నుంచి ఆర్‌డీవో పోస్టు ఇన్‌చార్జిలతోనే నడుస్తోంది. తదుపరి క్రమంలో కేఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న శేష శైలజను ఇన్‌చార్జి ఆర్‌డీవోగా నియమించారు. అయితే ఇటీవల కుమార్తె వివాహ కార ణంగా తనను రిలీవ్ చేయాలని ఆమె కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. శనివారం బాధ్యతలు స్వీకరించిన దిలీప్..కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.


