ఉక్కునగరంలో కాంట్రాక్ట్‌ కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఉక్కునగరంలో కాంట్రాక్ట్‌ కార్మికుడి మృతి

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుడు మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి. స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌–1 టీపీ బేలో పనిచేస్తున్న సుదామ కాంత పట్నాయక్‌ (54) శనివారం మధ్యాహ్నం విధుల విరామం అనంతరం భోజనానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే ఆయనను స్టీల్‌ప్లాంట్‌ ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఉక్కు జనరల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై కార్మిక నాయకులు సంబంధిత కాంట్రాక్టర్‌తో చర్చించగా, మృతుడి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు ఆయన అంగీకరించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement