పర్యావరణ రక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ రక్షణ అందరి బాధ్యత

Jun 6 2026 12:35 AM | Updated on Jun 6 2026 12:35 AM

తాటిచెట్లపాలెం: సౌత్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముడసర్లోవలో రాబోయే సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోనల్‌ ప్రధాన కార్యాలయం వద్ద జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ మాధుర్‌, సౌత్‌ కోస్ట్‌ రైల్వే ఉమెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ చారు మాధుర్‌, ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. వ్యర్థాలతో తయారు చేసిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా లయన్‌’ను సందీప్‌ మాధుర్‌ ఆవిష్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement