కేజీహెచ్‌ నిధులు, ఖాళీలపై ఆరా | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌ నిధులు, ఖాళీలపై ఆరా

Jun 6 2026 12:35 AM | Updated on Jun 6 2026 12:35 AM

మహారాణిపేట: కేజీహెచ్‌లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ‘సీసీఆర్‌’ ఎన్జీవో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జ్‌ కరోతు రాము శుక్రవారం సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు సమర్పించారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ దరఖాస్తును అందజేశారు. ప్రజా ప్రయోజనాల కోసం ఎన్జీవో చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ అభినందించారు. ఈ దరఖాస్తు ద్వారా కేజీహెచ్‌ పరిపాలన, హెచ్‌డీఎస్‌, సీఎస్‌ఆర్‌ నిధుల వినియోగం, గత రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధుల వివరాలను కోరారు. అలాగే ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఖాళీలు, గత ఐదేళ్ల నియామకాలు, రోగుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, మందుల కొనుగోలు,పంపిణీ, ఓపీ, ఐపీ రోగుల గణాంకాలపై సమగ్ర సమాచారాన్ని అందించాలని అభ్యర్థించారు. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత పెంచడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని కరోతు రాము తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీవో ప్రతినిధులు కె. అప్పలరాజు, బి. కన్నబాబు, ఎ. పైడిరాజు, ఎన్‌. రాజేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement