మహారాణిపేట: న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లోని స్టెయిన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఇంఫ్రాకాన్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ నిర్మాణ అకాడమీ రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకుంది. ఈ అవార్డులను ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ చేతుల మీదుగా నాక్ అదనపు డైరెక్టర్ జనరల్ డి. మనోహర్ స్వీకరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఏపీ జాతీయ నిర్మాణ అకాడమీ డైరెక్టర్ జనరల్ జి. గణేష్ కుమార్ ప్రభుత్వ సేవల్లో శ్రేష్టత విభాగంలో గోల్డ్ అవార్డును అందుకున్నారు.


