సైకిల్ సవారీలో అపశృతి చోటుచేసుకుంది. చంద్రబాబు, మంత్రులు, అధికారులు హ్యాపీగా ‘ఈవీ’ సైకిళ్లపై వెళ్లగా.. విద్యార్థులకు సాధారణ పెడల్ సైకిళ్లు ఇచ్చి వెనుక పరుగెత్తించారు. కరకచెట్టు పోలమాంబ దేవాలయం దాటిన తర్వాత డౌన్‌లో అజితేష్ అనే విద్యార్థి ఒక్కసారిగా తూలి కిందపడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి, ఆ విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తన వెనుక వస్తున్న విద్యార్థి కిందపడి గాయపడినా.. చంద్రబాబు కానీ, ఆయన వెంట ఉన్న మంత్రులు కానీ కనీసం ఆగి పరామర్శించకుండా, తమ ‘సైకిల్ షో’ పబ్లిసిటీయే ముఖ్యం అన్నట్టుగా ముందుకు సాగిపోవడం గమనార్హం.


