గూగుల్‌ డేటా సెంటర్‌తో పర్యావరణానికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

గూగుల్‌ డేటా సెంటర్‌తో పర్యావరణానికి ముప్పు

Jun 6 2026 12:35 AM | Updated on Jun 6 2026 12:35 AM

8లో

పర్యావరణవేత్తలకు ‘నో ఎంట్రీ’

తీర ప్రాంత పరిరక్షణ, జీవవైవిధ్యం, భవిష్యత్‌ తరాల ప్రయోజనాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తల అభిప్రాయాలు మాత్రం ఈ ప్రక్రియలో కనిపించకపోవడం మరో కీలక అంశంగా మారింది. విశాఖ తీర ప్రాంతం కేవలం భూమి కాదని, అది ప్రకృతి కవచమని నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇసుక తిన్నెలు, చిత్తడి నేలలు, సహజ వృక్ష సంపద తుఫాన్లు, సముద్రపు అలల ప్రభావాన్ని తగ్గించే సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయని చెబుతున్నారు. అలాంటి అభిప్రాయాలకు చోటు కల్పించకుండా కేవలం సీఆర్‌జెడ్‌ మార్పును సమర్థించే అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement